టీవీ చానళ్లలో మనకు రోజూ కనిపించే ప్రముఖ యాంకర్ సుమ గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె టీవీ షోలు, ఈవెంట్లు చేస్తూ యమా బిజీగా ఉంటుంది. ఇక యూట్యూబ్ చానల్‌ను కూడా ప్రారంభించడంతో ఆమె మరింత బిజీ అయిపోయింది. అలాగే ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా ఎప్పటికప్పుడు సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. నటుడిగా రాజీవ్ చక్కని పేరు తెచ్చుకున్నారు.
అయితే సుమ, రాజీవ్ కనకాల మధ్య గొడవలు వచ్చాయని, వారు విడాకులు తీసుకోబోతున్నారని, విడిగా ఉంటున్నారని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా వారు హైదరాబాద్‌లో వేర్వేరు ఇళ్లలో ఉండడం మొదలు పెట్టారు. అయితే తమ వైవాహిక బంధంపై రాజీవ్ కనకాల నోరు విప్పారు.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తన వివాహ బంధంపై క్లారిటీ ఇచ్చారు. సుమతో కొన్ని రోజులు నిజంగానే విడిగా ఉన్నానని చెప్పారు. అయితే అది వివాహ బంధంలోని గొడవ వల్ల కాదని, అసలు తమ మధ్య గొడవలు లేవని, ఆమెతో కలిసి కాకుండా విడిగా ఉండేందుకు కారణం ఉందని చెప్పారు.
తన తల్లి చనిపోయాక తండ్రి దేవదాస్ కనకాల మణికొండలో ఒక్కరే ఉండేవారని, ఆయనను తన ఇంటికి తీసుకువద్దామంటే ఆయన లైబ్రరీ చాలా పెద్దగా ఉందని, ఆ పుస్తకాలన్నింటినీ తన ఇంటిక తేవడం కష్టమని భావించి.. తానే తన తండ్రి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు గడిపానని, అందుకనే సుమ, తాను విడి విడిగా ఉండాల్సి వచ్చిందని.. అంతే తప్ప తమ వైవాహిక బంధంపై వచ్చిన వార్తలన్నీ అబద్దమని చెప్పారు. తాము కలిసే ఉన్నామన్నారు.
కాగా రాజీవ్ ఇటీవలే వెంకటేష్‌తో కలిసి నారప్ప సినిమాలో నటించారు. అందులో ఆయన కీలకపాత్ర పోషించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…