బుల్లితెరలో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు స్టార్ లుగా మారిపోయారు.బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఆ తరువాత వారి జీవితం బిగ్ బాస్ ముందు తరువాత అన్న విధంగా మారిపోయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఎంతోమంది కంటెస్టెంట్ లు ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగాఉన్నారు.అదేవిధంగా బిగ్ బాస్ ఎంతోమందిని జంటలుగా కూడా మార్చింది. వీరిలో ఒకరుగా మోనాల్, అఖిల్ జంట ఒకటని చెప్పవచ్చు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ జంటగా నిలిచారు.హౌస్ లో ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని త్వరలోనే ఇద్దరు జంట కాబోతున్నారని వార్తలు జోరుగా వినిపించాయి. ఈ క్రమంలోనే వీరిద్దరికీ సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మోనాల్, అఖిల్ బిగ్ బాస్ తర్వాత వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.”తెలుగు అబ్బాయి_గుజరాతి అమ్మాయి” అనే టైటిల్ తో ఈ సిరీస్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ప్రస్తుతం మోనాల్ పలు సినిమాలు డాన్స్ ప్లస్ షో తో బిజీగా ఉండటం వల్ల ఈ వెబ్ సిరీస్ పూర్తి చేయడానికి సమయం దొరకలేదు. ఈ క్రమంలోనే అఖిల్ కూడా ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ తర్వాత ఒక ముహూర్తం ఫిక్స్ చేసి ఈ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.