టాలీవుడ్ సింగర్ నోయల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నోయల్, నటి ఎస్తర్ ప్రేమ, పెళ్లి విడాకులు గురించి అందరికీ మనకు తెలిసిందే. ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వీరిరువురు కొన్ని కారణాల వల్ల పెళ్లి అయిన కొన్ని నెలలకే విడాకులుతీసుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ వీరిరువురూ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించడం లేదు. తాజాగా ఎస్తర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ప్రస్తుతం నెటిజన్లను ఆలోచనలో పడేసాయి.
సోషల్ మీడియా వేదికగా ఎస్తర్ స్పందిస్తూ…మనం ఎవరి కారణం చేత నవ్వుకుంటామో వారు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధ పడతాము. వారి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఏడుస్తాము. గతంలో మనం క్షణికావేశం వల్ల తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు పశ్చాత్తాప పడతాము. మనుషుల విలువ, కాలం విలువ మనుషుల మంచితనం ఏమిటో నాకు ఇప్పుడే తెలిసింది.
ఒక మంచి వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు చేసిన తప్పుడు పనులు కంటే చెడ్డ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు చేసే మంచి పనులకు ఎక్కువ పశ్చాత్తా పడాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే మనకు సరైన స్నేహితుని వెతుక్కునే ప్రయత్నాన్ని ఆపకూడదు. ఎంతో మంది చెడ్డ స్నేహితుల కంటే ఒక మంచి వ్యక్తి మన పక్కన ఉంటే జీవితం ఎంతో హాయిగా ఉంటుందని ఎస్తర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు ఎస్తర్ మరి నోయల్ గురించి ఆలోచిస్తున్నారా అని కామెంట్ చేయగా.. మరి కొందరుస్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక విధమైనటువంటి పోస్ట్ చేశారని కామెంట్లు పెడుతున్నారు.