హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పవిత్ర అనే ఆమెను వివాహం చేసుకుంటున్నాడని ఓ పెళ్లి పత్రిక కూడా వైరల్ అయింది. కానీ అందులో పేర్లు తప్ప వివరాలు ఏమీ లేవు. ఓ దశలో దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. మొదటి పెళ్లే పెటాకులు అయింది, రెండో పెళ్లి ఎందుకు అని బహిరంగంగానే కామెంట్ చేశారు. అయితే తన రెండో పెళ్లిపై సుమంత్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సుమంత్ ఓ వీడియోలో మాట్లాడారు.
తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, అదంతా వట్టి పుకారేనని సుమంత్ అన్నారు. ఆ శుభలేఖ నిజమే కానీ.. అది తన పెళ్లికి సంబంధించినది కాదని, సినిమాకు సంబంధించిందని అన్నారు. అందువల్ల ఈ విషయంలో ఇకపై పుకార్లు సృష్టించవద్దని కోరాడు.
కాగా సుమంత్ 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత విడాకులు తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. సినీ కెరీర్ విషయంలోనూ సుమంత్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. కానీ ఈ మధ్య నుంచే మళ్లీ మూవీల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…