సినిమా

సినీ న‌టుడు సుమ‌న్ జీవితంలో జ‌రిగిన ఆ సంఘ‌ట‌న‌.. కెరీర్ మొత్తాన్ని దెబ్బ‌తీసింది.. అస‌లేం జ‌రిగింది ?

1980-90ల‌లో సినీ న‌టుడు సుమ‌న్ కెరీర్ ఒక్క‌సారిగా ద‌సూకుపోయింది. త‌రువాత ఆయ‌న జీవితంలో జ‌రిగిన ఒక్క సంఘ‌ట‌న ఆయ‌న కెరీర్‌ను దెబ్బ తీసింది. అయితే ఆ సంఘ‌ట‌న వెనుక సినీ న‌టుడు చిరంజీవి ఉన్నార‌ని చాలా మంది అంటారు. కానీ అది నిజం కాదు. ఆ విష‌యాన్ని సుమ‌న్ స్వ‌యంగా చెప్పారు.

అప్ప‌ట్లో సుమ‌న్ కెరీర్ చిరంజీవికి పోటీగా ఉండేది. ఆయ‌న‌కు ఎంతో క్రేజ్ వ‌చ్చింది. తుళు ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కావ‌డం వ‌ల్ల ఆయ‌న అందంగా ఉండేవారు. సుమ‌న్ చాలా చ‌దువుకున్న‌వారు, మార్ష‌ల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. ఇక న‌ట‌న‌లోనూ పేరు తెచ్చుకున్నారు. అయితే అప్ప‌ట్లో ఆయ‌న త‌న స్నేహితులతో క‌లిసి ఒక పార్టీకి వెళ్లారు. ఆ పార్టీ జ‌రిగిన స్థ‌లంలో అత్యాచారం జ‌రిగింది. దీంతో అత్యాచారం కేసు న‌మోదు అయింది. అయితే అందులో సుమ‌న్ లేదా ఆయ‌న స్నేహితుల‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ పోలీసులు స్టేష‌న్‌కు పిలిపించి ఎంక్వ‌యిరీ చేశారు.

త‌రువాత జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించారు. 2 ఏళ్ల శిక్ష అనుభ‌వించారు. బెయిల్ వ‌చ్చింది. కేసు కొట్టేశారు. అందులో సుమ‌న్‌, ఆయ‌న స్నేహితులు ఏమీ చేయ‌లేద‌ని తేలింది. ఇక దీని వెనుక చిరంజీవి లేదా సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ఎవ‌రి ప్ర‌మేయం లేదు. కానీ సుమ‌న్ పెద్ద హీరో కనుక అప్ప‌ట్లో దీని గురించి ప్ర‌చారం బాగా అయింది. దీంతో ఆయ‌నకు సినిమా అవ‌కాశాలు రాలేదు. అలా కెరీర్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది.

ఆ సంఘ‌ట‌న‌లో త‌మ త‌ప్పు లేద‌ని తెలుసుకుని కేసును కొట్టేశార‌ని సుమ‌న్ చెప్పారు. అలాగే మోహన్ బాబు, సుమలత, సుహాసిని, భానుప్రియ, భాను చందర్, నూతన ప్రసాద్, కొంత మంది దర్శక నిర్మాతలు కూడా తనకి సహాయం చేశార‌ని, ధైర్యం చెప్పార‌ని సుమన్ తెలిపారు. ఈ విష‌యాలు పైన చెప్పిన పుస్త‌కం చ‌దివితే తెలుస్తాయి. అనుకోకుండా ఓ సంఘటనలో ఇరుక్కోవడం, అక్కడి నుండి లేని పోని పుకార్లు రావ‌డం, రెండేళ్ళు జైలులో ఉండటం వల్ల సుమ‌న్ కెరీర్ దెబ్బ తిన్నది. దీంతో అవ‌కాశాలు రాకుండా పోయాయి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM