గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక చాలా మంది జాబ్‌లను వెదుక్కునే పనిలో పడతారు. ఉద్యోగం దొరికితే సరే.. లేదంటే ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇక కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా ఉద్యోగాలు దొరకడం ఇంకా కష్టతరమవుతోంది. అయితే ఉద్యోగాలు దొరక్కపోయినా సరే తమ కాళ్లపై తాము నిలబడగలమని ఆ యువతులు నిరూపించారు. స్వయం ఉపాధి ద్వారా చక్కని ఆదాయం సంపాదిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన డి.రిషి వర్మ, నిజామాబాద్‌కు చెందిన కె.శ్రీదుర్గలు గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ వుమెన్ లో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ స్టడీస్ (రిటెయిల్ మేనేజ్‌మెంట్ అండ్ ఐటీ) విద్యను అభ్యసించారు. అయితే గ్రాడ్యుయేషన్ చేశారు కానీ కోవిడ్ వల్ల ఉద్యోగాలు దొరడం లేదు కదా, అందువల్ల ఖాళీగా ఉండడం ఇష్టం లేక సొంతంగా వ్యాపారం మొదలు పెట్టారు. ఫోక్‌టేల్స్ 22 పేరిట సంస్థను నెలకొల్పారు. దాని సహాయంతో ఊరగాయ పేరిట అనేక రకాల పచ్చళ్లు, పొడులను తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 16న బేగంపేటలో వారు ఊరగాయను నెలకొల్పగా దాంతో పచ్చళ్లు, పొడులను తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత నాణ్యంగా, శుభ్రమైన ప్యాకింగ్‌తో అత్యంత రుచికరంగా ఉండేలా వాటిని అందిస్తున్నారు. దీంతో వారి పచ్చళ్లు, పొడులకు రెగ్యులర్ కస్టమర్లు ఏర్పడ్డారు. ఈ విధంగా వారు ఇందులో సక్సెస్ సాధించారు.
ప్రస్తుతం వారు www.theuragaya.com అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందులో పచ్చళ్లను, పొడులను విక్రయిస్తున్నారు. టమాటా, మామిడి, నిమ్మ, గోంగూర, అల్లం, ఉసిరికాయ, ఎండు మిరప కాయ వంటి పచ్చళ్లను తయారు చేసి అమ్ముతున్నారు. వీరు వాటిని హోం డెలివరీ కూడా చేస్తున్నారు. బల్క్ ఆర్డర్లు తీసుకుని కూడా వాటిని తయారు చేస్తున్నారు. పచ్చళ్లను కేజీకి రూ.400 నుంచి విక్రయిస్తుండగా, పొడులను రూ.90 నుంచి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో తమ సంస్థను మరింత విస్తరిస్తామని వీరు చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయి కూడా ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న వారికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…