సరిగ్గా మనస్సు పెట్టి ఆలోచించాలే గానీ చేసేందుకు స్వయం ఉపాధి మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో గొర్రె పొట్టేళ్ల పెంపకం కూడా ఒకటి. కొద్దిగా శ్రమ పడాలే గానీ ఓపికతో అమ్మితే గొర్రె పొట్టేళ్లను అమ్మడం ద్వారా లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు.
గొర్రె పొట్టేళ్లను పెంచేందుకు చక్కని స్థలం ఉండాలి. అందులో గడ్డి పెంచితే మేలు. దాణాను బయట కొనవచ్చు. మొక్క జొన్న పిండి, పల్లి చెక్క, బియ్యం పొడి వంటి వాటిని దాణాగా వేయవచ్చు. అలాగే గొర్రెలకు ఎప్పటికప్పుడు టీకాలను కూడా వేయిస్తుండాలి. దీంతో అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.
1000 చదరపు అడుగుల స్థలం ఉంటే అందులో చిన్న షెడ్డు వేసి 40 గొర్రెలను పెంచవచ్చు. షెడ్డు నిర్మాణానికి సుమారుగా రూ.70వేల వరకు అవుతుంది. 3-4 నెలల వయస్సు ఉన్న గొర్రె పిల్ల ఒక్కటి రూ.5500 వరకు ధర ఉంటుంది. దాన్ని సుమారుగా 4 నెలల పాటు పెంచాలి. అప్పుడు దాని ధర రూ.9000 వరకు పలుకుతుంది.
గొర్రె పిల్ల మొదట్లో కొన్నప్పుడు సుమారుగా 15 కిలోల బరువు ఉంటుంది. 4 నెలలు పెంచితే 26 నుంచి 30 కిలోల వరకు బరువు పెరుగుతాయి. తరువాత పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కనుక అప్పుడు అమ్మేయాలి. ఈ క్రమంలో ఒక బ్యాచ్‌కు 40 గొర్రెలను పెంచితే వాటిని ఒక్కొక్కటి రూ.9000 కు అమ్మినా .. రూ.3.60 లక్షలు వస్తాయి. ఈ విధంగా గొర్రె పొట్టేళ్లను అమ్మి చక్కని ఆదాయం సంపాదించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…