కరోనా మొదటి వేవ్ మాత్రమే కాదు, సెకండ్ వేవ్ కూడా ఎంతో నష్టాన్ని మిగిల్చింది. దీని వల్ల చాలా మంది ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కేవలం సాధారణ ప్రజలే కాదు, వ్యాపార వేత్తలు కూడా కరోనా వల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సహాయం చేసేందుకు నడుం బిగించాయి. అందువల్ల మీరు డబ్బు సంపాదించాలని అనుకుంటుంటే ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగంలోనే చిన్న బిజినెస్ ప్రారంభించవచ్చు. పౌల్ట్రీ వ్యాపారం చేయవచ్చు. దీనికి గాను ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి. రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షలతో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.
పౌల్ట్రీ వ్యాపారం చేయాలంటే ముందుకు మీకు ఓ స్థలం కావాలి. లేయర్ కోళ్లను పెంచుతూ ఈ వ్యాపారం చేస్తే.. 1500 కోళ్లతో మీరు వ్యాపారం ప్రారంభిస్తే నెలకు రూ.50వేల నుంచి రూ.1 లక్ష వరకు సంపాదింవచ్చు. ఈ క్రమంలోనే మీకు సామగ్రి కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతో 1500 కోళ్లతో మీరు పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించవచ్చు. తరువాత ఎప్పటికప్పుడు 10 శాతం కోళ్లను పెంచుతూ పోవాలి.
పౌల్ట్రీ వ్యాపారంలో కోడిగుడ్లను అమ్మడం ద్వారా లాభాలు ఎక్కువగా వస్తాయి. కోడిగుడ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కనుక చక్కని ఆదాయం సంపాదించవచ్చు. ఒక్క లేయర్ కోడిపిల్ల ధర రూ.30 అనుకున్నా రూ.50వేలు పెడితే సుమారుగా 1600 పిల్లలు వస్తాయి. దీంతో వాటిని పెంచి గుడ్లను ఉత్పత్తి చేయవచ్చు. వాటికి భిన్న రకాల ఆహారాలను పెట్టాల్సి ఉంటుంది. సమయానికి మందులను ఇవ్వాలి.
కోడిపిల్లలను 20 వారాల పాటు పెంచేందుకు సుమారుగా రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతాయి. ఒక లేయర్ కోడి ఏడాదిలో సుమారుగా 300 గుడ్లను పెడుతుంది. 20 వారాల తరువాత కోళ్లు గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. తరువాత అవి ఏటా గుడ్లను పెడుతుంటాయి.
20 వారాలు పూర్తయ్యే సరికి కోళ్ల పెంపకానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అవుతుంది. ఈ క్రమంలో 1500 కోళ్ల నుంచి సుమారుగా 4,35,000 గుడ్లను తీయవచ్చు. అంటే ఏడాదికి యావరేజ్‌గా ఒక కోడి నుంచి 290 గుడ్లు వస్తాయన్నమాట.
వేస్టేజ్ పోయినా 4 లక్షల గుడ్లను అమ్మితే ఒక గుడ్డు ధర రూ.5 నుంచి రూ.7 మధ్య ఉంటుంది కనుక ఏడాదిలోనే గుడ్లను అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. సరిగ్గా చేయాలే కానీ ఏడాదిలోనే రూ.30 లక్షల మేర సంపాదించవచ్చు.
పౌల్ట్రీ వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రభుత్వాల నుంచి 25 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలు అయితే 35 శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు. బ్యాంకులు ఈ వ్యాపారం చేసేందుకు లోన్లను కూడా అందిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…