బిజినెస్ ఐడియాలు

Business Idea : చాలా త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ ఆదాయం వ‌చ్చే స్వ‌యం ఉపాధి మార్గం ఇది..!

Business Idea : ప్ర‌స్తుతం మ‌నకు స్వ‌యం ఉపాధి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కొన్నింటికి పెట్టుబడి పెద్ద ఎత్తున అవ‌స‌రం అవుతుంది. కొన్నింటికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఒక మోస్త‌రు పెట్టుబ‌డితో.. కొద్దిగా క‌ష్ట‌ప‌డి చేసే అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గ‌న్నీ బ్యాగ్స్ బిజినెస్ కూడా ఒక‌టి. వీటినే తెలుగు రాష్ట్రాల్లో గోనె సంచులు కూడా అంటారు. వీటి బిజినెస్ చేయాలంటే.. అందుకు ఏమేం అవ‌స‌ర‌మో.. ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. ఎంత వ‌ర‌కు ఆదాయం సంపాదించ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా రైతులు పండించే వ‌రి, గోధుమ త‌దిత‌ర అనేక ధాన్యాలు మొద‌లుకొని ప‌ప్పు గింజ‌లు, ఇత‌ర ఆహార పంట‌ల వర‌కు.. ధాన్యాల‌ను మొత్తం గ‌న్నీ బ్యాగుల‌లోనే ర‌వాణా చేస్తుంటారు. రైతుల వ‌ద్ద వ్యాపారులు వాటిని కొని గ‌న్నీ బ్యాగుల‌లో నింపి ప‌రిశ్ర‌మ‌ల‌కు, స్టోరేజ్‌ల‌కు త‌ర‌లిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే మార్కెట్ల‌లో పెద్ద ఎత్తున ఆయా ధాన్యాలు, ప‌ప్పు గింజ‌లు, ఇత‌ర ఆహార పంట‌ల విక్ర‌యాలు జ‌రుగుతుంటాయి. అయితే ఆయా మార్కెట్ల‌లో రైతులు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, వ్యాపారుల‌తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే.. గ‌న్నీ బ్యాగుల బిజినెస్ చేయ‌వ‌చ్చు.

Business Idea

సాధార‌ణంగా గ‌న్నీ బ్యాగుల‌ను జూట్ మిల్స్‌లో త‌యారు చేస్తారు. ఇవి అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిలో ఆ సంచుల‌ను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి మార్కెట్ల‌లో ఒక్కో సంచిని రూ.45 వ‌ర‌కు విక్రయించ‌వ‌చ్చు. మార్కెట్‌లో రైతుల‌కు ఇవి పెద్ద ఎత్తున అవ‌స‌రం అవుతుంటాయి. అయితే పెద్ద ఎత్తున పెట్టుబ‌డి పెట్టి.. ఈ సంచుల‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి విక్ర‌యిస్తే.. నెల నెలా రూ. ల‌క్ష‌ల నుంచి రూ.కోట్ల‌లో ఆదాయం సంపాదించ‌వ‌చ్చు.

ఇక గ‌న్నీ బ్యాగుల‌ను కొనుగోలు చేశాక వాటిని స్టోర్ చేసేందుకు గోదాముల‌ను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పంట ఉత్పత్తులు అయ్యే మార్కెట్ల‌లో విజిటింగ్ కార్డులు, పాంప్లెట్ల‌తో ప‌బ్లిసిటీ చేయాలి. దీంతోపాటు రైతులు, అధికారులు, వ్యాపారుల‌తో స‌త్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో గ‌న్నీ బ్యాగుల బిజినెస్ స‌క్సెస్ అవుతుంది. దీంట్లో న‌ష్టాలు వ‌చ్చే అవ‌కాశం దాదాపుగా చాలా త‌క్కువగా ఉంటుంది. అందువ‌ల్ల ఎవ‌రైనా స‌రే.. ఈ వ్యాపారాన్ని చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా మార్చుకోవ‌చ్చు. దీంట్లో వెచ్చించే పెట్టుబ‌డిని బ‌ట్టి ఎవరికైనా లాభాలు వ‌స్తాయి. పంట ఉత్పత్తులు ఎక్కువ‌గా విక్ర‌యాలు జ‌రిగే మార్కెట్ల‌లో పెద్ద ఎత్తున గోనె సంచులు అవ‌స‌రం అవుతాయి క‌నుక‌.. ఆ మార్కెట్లపై దృష్టి సారిస్తే నెల నెలా రూ. ల‌క్ష‌ల్లో ఆదాయం సంపాదించ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM