కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ప్రజలందరిని భయాందోళనలోకి నెట్టేసింది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి దశలో కేవలం వృద్ధులకు మాత్రమే కరోనా వ్యాపించగా రెండవ దశలో మాత్రం ఈ మహమ్మారి ఎవరిని వదలడం లేదు.
రెండవ దశ కరోనా వైరస్ వయసులో ఉన్న వ్యక్తులకు మాత్రమే కాకుండా నవజాత శిశువులలో,అదేవిధంగా 1 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన చిన్న పిల్లలలో కూడా వ్యాపిస్తుందని డాక్టర్ దిరెన్ గుప్తా ఓ ప్రకటనలో తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది నవజాత శిశువులు ఆసుపత్రిలో చేరారని డాక్టర్ రీతు సక్సేనా పేర్కొన్నారు.
ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించకపోతే చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని,ముఖ్యంగా చిన్నపిల్లలు నవజాత శిశువులలో ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. 15 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో దాదాపు 30 శాతం మంది యువకులు ఈ మహమ్మారి బారిన పడినట్టు తెలుస్తోంది