Whatsapp : ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ త్వరలో పాత స్మార్ట్ ఫోన్లలో పనిచేయదు. ఈ మేరకు వాట్సాప్ ఇది వరకే వివరాలను వెల్లడించింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్ పాత ఫోన్లకు మాత్రం సపోర్ట్‌ను ఇవ్వడం లేదు. అందులో భాగంగానే నవంబర్ 1వ తేదీ నుంచి పలు పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయబోవడం లేదు. ఈ మేరకు వాట్సాప్ వివరాలను వెల్లడించింది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లను వాడుతున్న వారు పాత తరం ఫోన్లు, డివైస్‌లు అయితే వెంటనే మార్చుకోవాలి. ఇక నవంబర్ 1 నుంచి కింద తెలిపిన ఫోన్లు, డివైస్‌లలో వాట్సాప్ పనిచేయదు.
యాపిల్‌కు చెందిన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. అలాగే శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ఎస్2, ట్రెండ్ 2, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ కోర్, ఎక్స్‌కవర్ 2, ఏస్2 ఫోన్లలోనూ నవంబర్ 1 నుంచి వాట్సాప్ పనిచేయదు.
ఎల్‌జీకి చెందిన లూసిడ్ 2, ఆప్టిమస్ ఎల్5 డ్యుయల్, ఆప్టిమస్ ఎల్4 2 డ్యుయల్, ఆప్టిమస్ ఎఫ్3క్యూ, ఆప్టిమస్ ఎఫ్7, ఆప్టిమస్ ఎఫ్5, ఆప్టిమస్ ఎల్3 2 డ్యుయల్, ఆప్టిమస్ ఎఫ్5, ఆప్టిమస్ ఎల్5, ఆప్టిమస్ ఎల్5 2, ఆప్టిస్ ఎల్3 2, ఆప్టిమస్ ఎల్7, ఆప్టిమస్ ఎల్7 2 డ్యుయల్, ఆప్టిమస్ ఎల్7 2, ఆప్టిమస్ ఎఫ్6, ఎనాక్ట్, ఆప్టిమస్ ఎఫ్3, ఆప్టిమస్ ఎల్4 2, ఆప్టిమస్ ఎల్2 2, ఆప్టిమస్ నైట్రో హెచ్‌డీ, 4ఎక్స్ హెచ్‌డీ ఫోన్లలోనూ వాట్సాప్ పనిచేయదు.
జడ్‌టీఈకి చెందిన గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వి987, జడ్‌టీఈ వి956, గ్రాండ్ మెమోలలో, హువావేకు చెందిన అసెండ్ జి740, అసెండ్ డి క్వాడ్ ఎక్స్ఎల్, అసెండ్ మేట్, అసెండ్ పి1 ఎస్, అసెండ్ డి2, అసెండ్ డి1 క్వాడ్ ఎక్స్ఎల్ ఫోన్లలోనూ వాట్సాప్ నవంబర్ 1 నుంచి పనిచేయదు.