Samantha : సోషల్ మీడియాలో సమంత ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తాను చేసే పనులు, పాల్గొనే కార్యక్రమాలకు చెందిన ఫొటోలను ఆమె షేర్ చేస్తుంటుంది. అయితే ఇటీవలి కాలంలో నాగచైతన్య లేకుండా ఆమె ఒంటరిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం చర్చనీయాంశంగా మారింది.

నాగచైతన్య, సమంత ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని, సమంత ప్రవర్తన అక్కినేని ఫ్యామిలీకి నచ్చడం లేదని.. అందుకనే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని.. ఈ మధ్య వార్తలు బాగా వస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా సమంత ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్తోంది.

ఇక నాగచైతన్య తాజా మూవీ లవ్‌స్టోరీకి సంబంధించి సమంత ఎలాంటి కామెంట్లు చేయలేదు. సాధారణంగా చైతూకు చెందిన ఏ మూవీ లాంచ్ అయినా, రిలీజ్ అయినా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. కానీ ఇప్పుడలా పెట్టలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న విషయానికి మరింత బలం చేకూరినట్లయింది.

అయితే సమంత తాజాగా హైదరాబాద్‌కు చెందిన కొందరు సైక్లిస్టులతో రైడ్‌కు వెళ్లింది. 21 కిలోమీటర్లు ప్రయాణించానని, 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కేందుకు ముందుకు సాగుతున్నానని, త్వరలో ఆ దూరం కూడా పూర్తి చేస్తానని సమంత చెప్పింది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
https://www.instagram.com/reel/CUTzafahi8z/?utm_source=ig_embed&ig_rid=985bab7a-95d2-4292-9bc7-a545783f3a19
ఇక తాజాగా ఆమె కీర్తిసురేష్, త్రిషలతో పార్టీకి అటెండ్ అయింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అలాగే లవ్‌స్టోరీ విడుదల సందర్భంగా హైదరాబాద్‌కు అమీర్‌ఖాన్ రాగా నాగచైతన్య, నాగార్జున ఆయనతో చిన్న పార్టీ చేసుకున్నారు. అందులోనూ సమంత కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు. చైతూతో విడాకుల సంగతేమిటి ? స్పష్టత ఇవ్వు.. అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం ఎప్పటికి తేలుతుందో చూడాలి.
https://www.instagram.com/p/CUB7cBXBTaa/?utm_source=ig_embed&ig_rid=dd7d9e9a-964d-42cc-b7d2-ff2aaadc1c23