తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు తన అద్భుతమైన నటన ద్వారా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఎంటరైన వర్ష ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో అద్భుతంగా నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో అను ఇమ్మానియేల్ తో కలిసిచేసే స్కిట్ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమెకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇంత ఫాలోయింగ్ ఉన్న వర్ష పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా జీ తెలుగులో ప్రసారమయ్యే”సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్” అనే కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా.. “ప్రేమ ఎంత మధురం”, “రామ చక్కని సీత” సీరియల్ నటీనటులు పాల్గొని ఎంతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలోకి జబర్దస్త్ వర్ష ప్రేమ ఎంత మధురం సీరియల్ టీమ్ తరఫున వచ్చింది.
https://youtu.be/vlWrOpRmAZg
ఈ కార్యక్రమంలో భాగంగా రెండు సీరియల్స్ మధ్య పోటా పోటీ నెలకొని పలు ఆటలలో పాటిస్పేట్ చేశారు.ఈ క్రమంలోనే తన టీమ్ తరఫున ఆడటానికి వచ్చిన వర్ష ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ షోలో భాగంగా ఒక రోలర్ పై ఒక చెక్కని పెట్టి దానిపై మరొకరు నిలబడితే ఒకరు రోలర్ ను తోయాలి.ఈ క్రమంలోనే చెక్కపై బాల్ పట్టుకొని వర్ష నిలబడగా ప్రేమ ఎంత మధురం సీరియల్ సభ్యులు రోలర్ ను కొద్దిగా గట్టిగా తోయడంతో వర్ష పొరపాటున ప్రమాదానికి గురైనట్లు చూపించారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.