ఒక ప్రభుత్వ కొలువులో ఉంటూ సామాజిక బాధ్యతలు నిర్వహించాల్సిన ఉద్యోగి తన విధుల పట్ల తప్పుడు మార్గం ఎంచుకుంది. సమాజానికి సేవ చేయాల్సింది పోయి.. సమాజానికి ద్రోహం చేస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ పట్టుబడింది. ఈ క్రమంలోనే ఆమెను విచారించగా సుమారు పాతిక లక్షల వరకు దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇంతకీ మహిళా కానిస్టేబుల్ ఏం చేసింది..? ఏంటి ?అనే విషయాల గురించి తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని వసాయి పోలీస్ స్టేషన్‌లో స్టోర్ క్లర్క్‌గా మంగళ్ గైక్వాడ్ అనే మహిళ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ కారణాల వల్ల సీజ్ చేయబడిన వాహనాలను, వాటి నగదుకు సంబంధించిన విషయాలను రికార్డు చేయడం ఆమె పని. ఈ క్రమంలోనే ఆమె బాధ్యతలను మరిచి దొంగదారిని ఎంచుకుంది. ఈ క్రమంలోనే స్క్రాప్ డీలర్ ముస్తాక్ తో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా వాహనాలను వస్తువులను బేరానికి పెట్టి డబ్బులు పోగు చేసుకునేది.
ఈ క్రమంలోనే సదరు హెడ్ కానిస్టేబుల్ పై అనుమానాలు రావడంతో పోలీసులు తనపై నిఘా ఉంచి గైక్వాడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే సదరు హెడ్ కానిస్టేబుల్ సుమారు పాతిక లక్షల వరకు వస్తువులను దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సదరు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా దొంగ దారులు వెతుక్కుంటే ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.