మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్.. స్మార్ట్ 5ఎ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో ఎ20 ప్రాసెసర్‌ను అమర్చారు. 2జీబీ ర్యామ్ ఉంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది.
ఈ ఫోన్లో వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. మరో డెప్త్ సెన్సార్‌ను కూడా అమర్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5ఎ ఫీచర్లు
- 6.52 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1540 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 1.8 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ20 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్
- 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్
- డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్, డీటీఎస్ హెచ్డీ సరౌండ్ సౌండ్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ
- బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5ఎ స్మార్ట్ ఫోన్ ధర రూ.6499గా ఉంది. దీన్ని ఆగస్టు 9 నుంచి విక్రయిస్తారు. ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ లభిస్తుంది.