డబ్బును పొదుపు చేసుకునేందుకు పోస్టాఫీస్ మనకు ఎన్నో రకాల అద్భుతమైన పథకాలను అందిస్తోంది. వాటిల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) ఒకటి. ఈ పథకం ద్వారా డబ్బును పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చు.
NSC ద్వారా పెట్టే మొత్తానికి ప్రస్తుతం 6.8 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఈ పథకంలో పెట్టే డబ్బుకు వడ్డీని ఏడాదికి ఒకసారి చెల్లిస్తారు. అయితే మెచూరిటీ తీరాకే డబ్బులను అందిస్తారు. ఈ పథకానికి మెచూరిటీ సమయం 5 ఏళ్లు. ఆ తరువాత డబ్బులను చెల్లిస్తారు. మెచూరిటీ సమయం 5 ఏళ్లు ముగిశాక మరో 5 ఏళ్లు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు.
ఈ పథకంలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. అందుకు లిమిట్ లేదు. NSC ద్వారా డబ్బులను పొదుపు చేస్తే ఆదాయపు పన్ను చట్టం 1961 యాక్ట్ సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
NSC లో భాగంగా నిర్దిష్టమైన మొత్తాలకు ఎన్ని సర్టిఫికెట్లను అయినా కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా రూ.15 లక్షలను పెట్టుబడి పెడితే 5 ఏళ్లకు రూ.20.85 లక్షలు వస్తాయి. 6.8 శాతం వడ్డీని చెల్లిస్తారు. 5 ఏళ్లలో రూ.6 లక్షలు వడ్డీ వస్తుంది.