క్రికెట్ ప్లేయర్లలో స్టైల్ అనే పదం వినబడగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోనీయే. ఎంఎస్ ధోనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టైల్స్ లో మనకు దర్శనమిస్తుంటాడు. నూతన ట్రెండ్స్‌ను ఫాలో అవుతుంటాడు. కొత్త కొత్త లుక్‌లలో ఆశ్చర్య పరుస్తుంటాడు. ఇక తాజాగా ధోనీ హెయిర్ కట్ చేయించుకుని తన కొత్త స్టైల్‌కు చెందిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ధోనీకి హెయిర్ కట్ చేశాడు. అనంతరం ధోనీ ఫొటోలను హకీమ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ధోనీ కొత్త హెయిర్ కట్‌కు అతని అభిమానులు ఫిదా అవుతున్నారు.
Legend Dhoni👑 Sports A Dashing Look 🔥🔥🔥
Thoroughly enjoyed doing this haircut & beard for our legend Mahendra Singh Dhoni 🔥🔥🔥#MSD #mahendrasinghdhoni #dhoni #msdhoni #fauxhawk #dhonisnewhaircut #dhonistyle #captaincool #aalimhakim #hakimsaalim #viral #trending pic.twitter.com/h17NX8qbDB
— Aalim Hakim (@AalimHakim) July 30, 2021
https://twitter.com/DhoniArmyTN/status/1421000791305854976
https://twitter.com/CskIPLTeam/status/1421002067879948292
https://twitter.com/CSKFansArmy/status/1420978734627123200
కాగా ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ఏడాది మధ్యలోనే ఐపీఎల్ ఆగిపోయింది. కోవిడ్ కేసులు బయట పడడంతో ఐపీఎల్‌ను 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే వాయిదా వేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఆ మ్యాచ్‌లు యూఏఈలో జరగనున్నాయి. ఇక ఈ ఐపీఎల్ ధోనీకి ఆఖరిది అని భావిస్తున్నారు. దీంతో చివరి టోర్నీలో ధోనీ సారథ్యంలో ఎలాగైనా సరే చెన్నై ట్రోఫీని ఎత్తాలని భావిస్తోంది.