Micromax IN 2b: మొబైల్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కొత్తగా ఇన్ 2బి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.
ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 5 మెగాపిక్సల్ కెమెరా ముందు వైపు ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి ఫీచర్లు
- 6.52 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్
- డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
- యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి స్మార్ట్ ఫోన్ కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7,999గా ఉంది. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మైక్రోమ్యాక్స్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఆగస్టు 6 నుంచి విక్రయించనున్నారు.