ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న IOCL శాఖలలో పనిచేసేందుకు గాను పలు విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 246 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఆపరేటర్, జూనియన్ అటెండెంట్, జూనియన్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ లేదా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలు కాగా ఫిబ్రవరి 23ను చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష ఏప్రిల్‌లో ఉంటుంది. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెలలో ఫలితాలను ప్రకటిస్తారు.
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గాను ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. జూనియర్ ఆపరేటర్ పోస్టులకు టెన్త్ లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి. జూనియర్ అటెండెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలి. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. రూ.300 అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. రిజర్వ్‌డ్ విభాగాలకు చెందిన వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థులకు నెలకు రూ.23వేల నుంచి రూ.1.05 లక్షల వరకు వేతనం ఇస్తారు. ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయి. మరిన్ని వివరాలకు గాను https://iocl.com/latest-job-opening అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.