Water Fall In Dream : వ్యక్తి జీవితంలో జోతిష్యశాస్త్రం ఎంత ప్రభావాన్ని చూపుతుందో కలల శాస్త్రం కూడా దాదాపు అంతే ప్రభావాన్ని చూపుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మనకు కలలు రావడం సహజం. ఈ కలల అర్థాన్ని మనం కలల శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. డ్రీమ్ సైన్స్ ప్రకారం మనకు వచ్చే కలలు అనేక విషయాలను సూచిస్తాయి. ఇవి భవిష్యత్తులో జరిగే వాటిని కూడా సూచిస్తాయి. అలాగే మనకు కలలో కొన్ని సంఘటనలతో పాటు కొన్ని వస్తువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కలలో కొన్ని వస్తువులు కనిపిస్తే మంచి జరిగేతే, కొన్ని వస్తువులు కనిపిస్తే మాత్రం చెడు జరుగుతుంది.
ఈ కలలను కనుక మనం సకాలంలో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో జరిగే నష్టాన్ని మనం నివారించుకోవచ్చు. మనకు కలలో కనిపించే కొన్ని వస్తువులు.. అలాగే ఇవి మంచిని సూచిస్తాయా.. చెడును సూచిస్తాయా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కలల శాస్త్రం ప్రకారం మనకు కలలో నీటి జలపాతాన్ని చూడటం శుభసూచకంగా భావించబడుతుంది. నిద్రిస్తున్నప్పుడు తెల్లటి స్పష్టమైన జలపాతం లేదా నీటిజలపాతం కనిపిస్తే ఆనందం మీ జీవితంలోకి రానున్నదని అర్థం. ఇలాంటి కలలు మీ జీవితంలో బాధల ముగింపును సూచిస్తాయని అర్థం. ఇక ఇలాంటి కలలు మీ ఇంట్లో శ్రేయస్సును కూడా పెంచుతాయి. అలాగే కలల శాస్త్రం ప్రకారం కలలో మురికి నీరు, వేడి నీరు కనిపించడం అశుభం. మురికి నీరు లేదా వేడి నీరు కలలో కనిపిస్తే భవిష్యత్తులో సమస్యలు రాబోతున్నాయని అర్థం.

అదే విధంగా నిద్రలో మనకు కొన్ని సాధ్యం కానీ కలలు కూడా వస్తూ ఉంటాయి. కలలకు ఎటువంటి పరిమితి ఉండదు. ఒక్కోసారి మనం ఎగురుతన్నట్టు కూడా కల వస్తుంది. మనం ఎగిరినట్టు కల వస్తే అది శుభసూచకం. అటువంటి కలలు చాలా పవిత్రమైనవిగా కూడా పరిగణించబడతాయి. త్వరలో మీ సమస్యలు తీరనున్నాయని దీని అర్థం. ఈ విధంగా మనకు నిద్రలో వచ్చే ఒక్కో కల ఒక్కో అర్థాన్ని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.