ఆషాడ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈ గురు పౌర్ణమిని హిందువులు పెద్ద పండుగగా జరుపుకుంటారు. గురుపౌర్ణమిని వేద వ్యాస మహర్షి జన్మదినం సందర్భంగా గురుపౌర్ణమిని జరుపుకుంటారు. ఎంతో పవిత్రమైన ఈరోజు ప్రతి ఏడాది ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 24 జూలై నెలలో గురు పౌర్ణమి వచ్చింది. మరి ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
వేదవ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా గురుపౌర్ణమి రోజు గురు విగ్రహానికి లేదా గురు ఫోటోకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించి గురువుకి ప్రత్యేక పూజలు చేస్తారు.మనం ఏదైనా ఆర్థిక ఇబ్బందులు తదితర సమస్యలతో సతమతమవుతుంటే పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు పేదలకు పసుపు రంగు ధాన్యాలను లేదా పసుపు రంగు మిఠాయిలను దానం చేయడం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి.
ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఈ పనులు చేయటం వల్ల గురువు ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది. గురు పౌర్ణమి రోజు ఎవరు మాంసం, మద్యం ముట్టుకోకూడదు. ఈ గురు పౌర్ణమి రోజు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి కానీ, పొరపాటున కూడా ఇతరులపై కోపాన్ని ప్రదర్శించకూడదని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో గురువును పూజించడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయి.