Sugar : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన, మన ఆరోగ్యం పాడవుతుంది. మనం తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. దాని వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది, పంచదారని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. అయితే, పంచదారని వీటితో పాటు అసలు తీసుకోవద్దు. పంచదారని వీటితో పాటు తీసుకుంటే ఇబ్బంది పడాలి. చక్కెరని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమంది, ఆహార పదార్థాలతో చక్కెరని కలిపి తింటూ ఉంటారు.
కాఫీలో చక్కెరని వేసుకుంటూ ఉంటారు. అయితే, కాఫీ చక్కెర తీసుకుంటే అధిక షుగర్ కంటెంట్ మీ బాడీలోకి వెళ్లి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. సో, కాఫీలో చక్కెరని తగ్గించుకోవడం మంచిది. ఫ్రూట్ జ్యూస్ లలో రుచి కోసం చక్కెరని చాలామంది కలుపుకుంటూ ఉంటారు. అయితే, నిజానికి పండ్లల్లో సహజమైన చక్కెర ఉంటుంది. పండ్లలో ఉండే షుగర్, ఈ షుగర్ తో కలవడం వలన, అనేక సమస్యలు వస్తాయి.

అలానే, పాలల్లో కూడా చక్కెర వేసుకొని తీసుకుంటూ ఉంటారు. పాలల్లో షుగర్ వేసుకుంటే, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. ఇది అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. యోగర్ట్ లో క్యాల్షియం, ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది, చక్కెరని కలుపుకుని తీసుకుంటూ ఉంటారు. దీని వలన అధిక క్యాలరీలు అంది ఆరోగ్యం పాడవుతుంది. చాలా మంది చపాతి తింటూ ఉంటారు.
చపాతీలులో చక్కెరని వేసుకొని కూడా తింటూ ఉంటారు ఈ రెండిటిని కలిపి తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. చక్కెర కలిపిన క్రీమ్ ని వేసుకోకూడదు. దీనివలన బరువు పెరిగిపోతారు. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. చక్కెర కలిపిన పెరుగు కూడా తీసుకోకూడదు. చక్కెర ని అసలు ఈ ఆహార పదార్థాలతో జోడించి తీసుకోవద్దు.