Top Telugu Web series in 2023 : మరి కొద్ది గంటలలో 2023కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్‌కి స్వాగతం పలుకుతున్నాం. అయితే పాత ఏడాదికి బైబై చెప్పే సమయంలో ఆ ఏడాది జరిగిన పలు విషయాల గురించి చర్చించుకోవడం ఎప్పటి నుండో వస్తుంది. ఈ ఏడాది మనకు చాలా సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్ లు మంచి వనోదం పంచాయి. అయితే 2023లో దుమ్మురేపిన కొన్ని టాప్ వెబ్ సిరీస్‍లు ఏంటనేది చూస్తే.. ముందుగా హీరో నాగచైతన్య ‘ధూత’ అని చెప్పలి. ఈ వెబ్ సిరీస్‍తో ఈ ఏడాది ఓటీటీలోకి అడుగుపెట్టారు. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్.. ధూత వెబ్ సిరీస్‍ను సూపర్ నేచులర్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించిన దయా సీజన్-1 వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ దక్కింది. బెంగాలీ సిలీస్ తక్దీర్ కథ ఆధారంగా ఈ సిరీస్‍ను తెలుగులో దయాగా రూపొందించారు .డిస్నీ+ హాట్‍స్టార్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఇక బిగ్‍బాస్ ఫేమ్ వీజే సన్నీ, కృష్ణ బూర్గుల, రవిరాజ్ కీలకపాత్రలు పోషించిన ఏటీఎం సీజన్-1 వెబ్ సిరీస్ దోపిడీ చూట్టూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందగా, ఇది బాగానే అలరించింది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇక యాత్ర ఫేమ్ మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన సైతాన్ తెలుగు వెబ్ సిరీస్ కూడా బాగానే పాపులర్ అయింది. సస్పెన్స్ ఎలిమెంట్లతో ఈ సిరీస్ ఆకట్టుకుంది. డిస్నీ+ హాట్‍స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ దక్కింది. జీవితంలో పైకి ఎదగాలని కష్టపడే అమ్మాయిగా నిత్యామీనన్ అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ అవుతుంది. ఇవే కాక డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చిన హారర్ సిరీస్‍లు అతిథి, మ్యాన్షన్ 24 కూడా మంచి వినోదాన్ని పంచాయి. ఇక కామెడీ ప్రధానంగా వచ్చిన సేవ్ టైగర్స్ (డిస్నీ+ హాట్‍స్టార్), మాయా బజార్ ఫర్ సేల్ (జీ5) , లీగల్ డ్రామా ‘వ్యవస్థ’ (జీ5), ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘వ్యూహం’ (అమెజాన్ ప్రైమ్ వీడియో), లావణ్య త్రిపాఠి ‘పులి మేక’ (జీ5) వెబ్ సిరీస్‍లు పర్వాలేదనిపించాయి.