సాహసాలు చేసేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. చిన్న తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తరువాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అయితే కొన్ని సార్లు అలాంటి సందర్భాల్లో కొందరు లక్కీగా బయట పడుతుంటారు. రష్యాలోనూ సరిగ్గా అలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
రష్యాలోని సులక్ కానయాన్ అనే కొండ ప్రాంతంలో కొండ అంచు ఒక పెద్ద ఉయ్యాల ఉంది. అందులో కూర్చుని ఊగవచ్చు. ఊగినప్పుడల్లా కొండ నుంచి దూరంగా పోతారు. మళ్లీ వెనక్కి వస్తారు. దాని మీద కూర్చుని ఊగుతుంటే లోయలోకి వెళ్లినట్లు ఫీలింగ్ కలుగుతుంది. ఆ లోయ ఎత్తు 6300 అడుగులు.
https://twitter.com/Random_Uncle_UK/status/1415209072090042372
అయితే ఆ ఉయ్యాల మీద ఇద్దరు మహిళలు కూర్చుని ఊగసాగారు. వెనుక నుంచి ఒక వ్యక్తి వారి ఉయ్యాలను ఊపుతున్నాడు. కానీ సడెన్గా అనుకోకుండా ఆ మహిళలకు బ్యాలెన్స్ తప్పింది కొండ అంచు నుంచి కిందకు పడిపోయారు. కానీ లక్కీగా వారు ప్రమాదం నుంచి బయట పడ్డారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. వారు పూర్తిగా లోయలో పడిపోక ముందే వారిని రక్షించారు. అయితే ఈ ఘటనపై అక్కడి పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.