Post Office Money Saving : చాలామంది, ఈ రోజుల్లో భవిష్యత్తులో ఏ సమస్యలు కలగకూడదని, డబ్బులు దాచుకుంటున్నారు. కొంతమంది బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, కొంత మంది పోస్ట్ ఆఫీస్ అందించే స్కీముల్లో డబ్బులు ని పెడుతూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో డబ్బులు పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. చాలా మంది, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ ఉంటారు. చక్కటి ప్రాఫిట్ ని పొందుతూ ఉంటారు. మీరు కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, డబ్బులు పోస్ట్ ఆఫీస్ లో దాచుకోవాలని అనుకుంటున్నారా…?
అయితే, కచ్చితంగా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ గురించి తెలుసుకోవాలి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాకి నెలకి కనీసం 100 వేయాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కువ మొత్తాన్ని జమ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనికి 6.7 శాతం వడ్డీ వస్తోంది. మీరు కనుక, 1.80 లక్షల పెట్టుబడి పెట్టినట్లయితే, 32,972 వడ్డీని పొందవచ్చు. రూ.3000 నెలవారి డిపాజిట్ తో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని ఎంచుకోవడం ఇంకా లాభదాయకంగా ఉంటుంది.

సంవత్సరానికి సగటున 12% రాబడితో అదే సమయ వ్యవధిలో 1.80 లక్షల డిపాజిట్ పై 67,459 సంపాదించొచ్చు. ఎస్ఐపి కి కనీసం 500 నెలవారీ డిపాజిట్ అవసరం. కేవలం 100 తో కూడా ఖాతాని ఓపెన్ చేయొచ్చు. SIP, 12 శాతం రాబడితో ఐదేళ్లలో రూ. 2,47,459కి వెళ్ళచ్చు కూడా. మీరు ఎంచుకునే దాని బట్టీ, రిస్క్ వుంది.
ప్రభుత్వ మద్దతు ఉన్న పోస్ట్ ఆఫీస్ RD ని ఎంచుకున్నా లేదంటే మీరు SIP యొక్క సంభావ్య అధిక రాబడిని సెలెక్ట్ చేసుకున్నా, వ్యూహాత్మక పెట్టుబడి ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తుకు మార్గము. ఇలా, మీరు ఈ స్కీమ్ తో కేవలం 100 రూపాయలు పెట్టుబడి పెడితే 2.5 లక్షలు వరకు వస్తాయి. పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలీదు. కానీ, ఈ స్కీమ్ తో చక్కటి ప్రాఫిట్ వస్తుంది.