Dhootha OTT : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సక్సెస్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ చైతూతో దూత అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ వెబ్ సిరిస్ తో చాలా గ్రాండ్ గా ఓటీటీ అరంగేట్రం చేశారు చై. సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్లో ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరిస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రసారం అవుతుండగా, ఈ వెబ్ సిరీస్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
సుమారు 40 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్ ఉన్న దూత సిరీస్ సస్పెన్స్‌తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్‌ని ఏకంగా 240 దేశాల్లో 38 భాషల్లోని సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఈ వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండడం చూసి యూనిట్ చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ చెప్పిన దూత ఆలోచన, కథాంశం చాలా నచ్చింది. ఈ కథకు నాగ చైతన్యే మొదటి ఎంపిక. ఆయన కూడా కథ వినగానే చేద్దామన్నారు అని అన్నారని ప్రొడ్యూసర్ శరత్ మరార్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ని జూన్, జులై లోనే పూర్తి చేసి ఫైనల్ కాపీ అమేజాన్ కి ఇచ్చాం. అయితే ఇచ్చిన తర్వాత ఎన్నో భాషల్లో డబ్, సబ్ టైటిల్స్ చేసి తర్వాత విడుదల చేస్తామని వారు మాకు ముందు చెప్పారు.

ఆ ప్రక్రియ కోసం దాదాపు ఐదు నెలలు సమయం తీసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా మాకు కొత్తగా అనిపించింది. అయితే విడుదలైన తర్వాత అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన రావడం మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుందని అన్నారు శరత్ మరార్.. లాంగ్ ఫార్మట్ స్టొరీ టెల్లింగ్ అనేది ఇండియాలో కొత్త ఫార్మాట్. కొన్ని సిరిస్ లు వచ్చినప్పటికీ ఇంకా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే. ఈ క్రమంలో చేసిన ప్రాజెక్ట్ కు ప్రేక్షకులు నుంచి ఇంత మంచి స్పందన రావడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని ఆయన చెప్పుకొచ్చారు.