Most Watched Web Series in Netflix : ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రతి వారం కూడా వైవిధ్యమైన కంటెంట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. కొన్ని వెబ్ సిరీస్‌లుప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3 మధ్య ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్ ఇప్పుడు చూస్తే ఇందులో తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషలకి సంబంధించిన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కొరియన్ భాషలో రిలీజై సంచలన విజయం సాధించిన స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ ఇంగ్లిష్ వెర్షన్ టాప్ లో ఉండటం విశేషం. మొదటిగా స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్: సీజన్ 1 – కొరియన్ సిరీస్ కు ఇప్పటి వరకూ 1.14 కోట్ల వ్యూస్ వచ్చాయి. 8.5 కోట్ల గంటల పాటు ఈ సిరీస్ చూశారు.
ఇక రెండోది బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ద నైఫ్: సీజన్ 1 – 3 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ కు ఇప్పటి వకరూ 74 లక్షల వ్యూస్ వచ్చాయి. మూడోది ఒబ్లిటరేటెడ్: సీజన్ 1 – 70 లక్షల వ్యూస్ వచ్చాయి. నాలుగోది ది క్రౌన్: సీజన్ 6 – మూడు వారాలుగా టాప్ 10లో ఉంటున్న ఈ సిరీస్ కు గతవారం 39 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక ఐదవది కొకొమెలన్ లేన్: సీజన్ 1 – ఈ కామెడీ సిరీస్ కు ఇప్పటి వరకూ 28 లక్షల వ్యూస్ రావడం విశేషం.ఆరవది వర్జిన్ రివర్: సీజన్ 5 – ఈ రొమాన్స్ డ్రామా సిరీస్ కు 27 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఇక ఏడవది యంగ్ షెల్డన్: సీజన్ 1 – ఈ సిరీస్ ను గత వారం 27 లక్షల మంది చూసినట్టు తెలుస్తుంది. ఇక ఎనిమిదోది ఆల్ ద లైట్ వియ్ కెన్ నాట్ సీ: లిమిటెడ్ సిరీస్ – రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొందగా, ఈ వార్ డ్రామా సిరీస్ ఐదు వారాలు టాప్ 10లో ఉంది. ఇందులో గత వారం 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక తొమ్మిదోది యంగ్ షెల్డన్: సీజన్ 2 – ఈ సిరీస్ రెండో సీజన్ కు 17 లక్షల వ్యూస్ వచ్చాయి. పదోది ఫస్ట్ వైవ్స్ క్లబ్: సీజన్ 1 – ఈ వెబ్ సిరీస్ కు గతవారం 15 లక్షల వ్యూస్ వచ్చాయి.