Supritha Naidu : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలలో అక్క, వదిన,పిన్న, అత్త పాత్రలలో కనిపించి సందడి చేసింది. సురేఖా వాణి అప్పట్లో ప్రతి సినిమాలో కనిపించి సందడి చేసింది.ఇప్పుడు మాత్రం పెద్దగా అలరించలేకపోతుంది.అయితే తన భర్త చనిపోయాక కూతురితో కలిసి తెగ సందడి చేస్తుంది. సురేఖా వాణి కూతురు సుప్రిత హీరోయిన్ కాకపోయినప్పటికీ అంతకుమించి అన్నట్లుగా ఉంది ఆమె తీరు. ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటోంది సురేఖావాణి డాటర్. దీంతో నిత్యం సుప్రితకు సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సుప్రిత సినిమాలు చేసింది లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ పెంచుకుంది.సురేఖావాణి డాటర్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ నిత్యం నెట్టింట వేడి పుట్టిస్తూ తన గ్లామర్ ఒలకబోస్తూ క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. కొందరు నెటిజన్స్ సుప్రిత చేసిన రీల్స్ ను ట్రోల్ కూడా చేశారు. అయితే ఆమె తనపై జరిగే ట్రోలింగ్‌ని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. తాజాగా తన పై జరుగుతున్న ట్రోల్స్ పై స్పందించింది. ఈ సారి ట్రోల్స్ తనకు బాధించాయి అని తెలిపింది.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు సురేఖ, సుప్రిత.ఈ ఫొటోలో ఇద్దరు చాలా హాట్‌గా కనిపిస్తున్నారు. అయితే శుభాకాంక్షలు చెబితే ట్రోల్ చేస్తారా అనేదే కదా మీ డౌట్. కారణం ఏంటంటే… ఎన్నికలకు ముందు సురేఖ వాణి, సుప్రిత ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ కు సపోర్ట్ గా పలు రీల్స్ చేశారు. డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో షేర్ చేయడంతో ట్రోల్ చేస్తున్నారు. దీంతో సుప్రిత.. గెలిచిన రేవంత్ రెడ్డికి విషెస్ చెప్పాను. దీనికే నన్ను ట్రోల్ చేయడం ఏంటి..? నేను మీకేం అన్యాయం చేశాను..? నాపై ఎందుకింత నెగిటివిటీ పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక స్థితి పై చాలా ప్రభావం చూపిస్తుంది. దాన్ని అర్థం చేసుకోండి. అంటూ సుప్రిత రాసుకొచ్చింది.