Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం టాలీవుడ్లో హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈ హీరో సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాలకే ఇద్దరూ విభేదాలవల్ల విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకొని రెండు సంవత్సరాల పైనే అవుతుంది. అయినప్పటికీ కూడా ఇద్దరి గురించి ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య రిలేషన్ లో ఉన్నాడంటూ ఏడాది కాలంగా రూమర్స్ వినిపిస్తుండగా, దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలని సైతం చూపుతున్నారు. విదేశాల్లో డేటింగ్ చేస్తూ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
తమపై వచ్చే ప్రచారాలపై నాగచైతన్య స్పందించలేదు. శోభితా మాత్రం అందులో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అయితే నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అలానే ధూత అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని అలరించబోతున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్స్ చేస్తూ పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తనపై వచ్చే రిలేషన్స్ గురించి మాట్లాడిన చైతూ.. వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా నేనే స్వయంగా వెల్లడిస్తా. అందులో నాకేం ఇబ్బందేమీ లేదు అని సమాధానం ఇచ్చాడు. అలాగే తన గురించి వచ్చే వదంతుల గురించి కూడా చైతన్య స్పందించాడు. నా గురించి ఎవరేం అనుకున్నా పట్టించుకోను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే ఉంది అని క్లారిటీ ఇచ్చేశాడు.

తనకు కుదిరినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను అని చెప్పిన చైతూ ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని అన్నాడు. తండేలు’ తర్వాత శివ నిర్వాణ సినిమా చేస్తారని టాక్ నడుస్తుంది, దీని గురించి ఏమని అంటారు అంటే.. శివ నిర్వాణకు మరో సినిమా చేయాలి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతానికి ఆ కథపైనే దృష్టిపెట్టాను అని చెప్పాడు. అంటే త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ రావొచ్చని తెలుస్తుంది.