చైనాలోని వూహాన్‌లో 2019లో మొదటి సారిగా కరోనా వైరస్‌ను గుర్తించారు. తరువాత కొన్ని నెలల్లోనే ఆ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసాన్ని సృష్టించింది. ఎన్నో కోట్ల మంది చనిపోయారు. అయితే తాజాగా చైనాలోనే మరో కొత్త ప్రాణాంతక వైరస్‌ను గుర్తించారు. దాన్నే మంకీ బి వైరస్ (బీవీ)గా పిలుస్తున్నారు. ఈ వైరస్ సోకి అక్కడ ఒక వ్యక్తి మృతి చెందాడు.
బీజింగ్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న 53 ఏళ్ల వెటర్నరీ వైద్యుడికి ఇటీవల మంకీ బి వైరస్ సోకింది. కోతుల శరీర భాగాలపై పరిశోధన చేస్తున్న సమయంలో అతనికి ఆ వైరస్ సోకింది. దీంతో అతనికి తీవ్రమైన వికారం, వాంతులు కలిగాయి. ఆ తరువాత అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మే 27వ తేదీనే అతను చనిపోయినా ఈ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సదరు వైరస్ సోకి చనిపోయిన మొదటి వ్యక్తిగా అతన్ని గుర్తించారు. దీన్ని 1932లో తొలిసారిగా గుర్తించారు. తరువాత ఈ కేసు రావడం ఇదే మొదటి సారి. ఈ వైరస్ సోకిన వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చనిపోయే అవకాశాలు 80 శాతం వరకు ఉంటాయి. అయితే ఈ వైరస్ గురించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.