Martin Luther King OTT : థియేటర్‌లో విడుదలైన సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. అయితే థియేటర్‌లో రిలీజై సరైన వినోదం పంచని కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకుంటున్నాయి. సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యిందని , ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. అక్టోబర్ 27, 2023న సినిమా థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది మార్టిన్ లూథర్ కింగ్. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లీవ్ నవంబర్ 29 నుంచి ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందంటూ ఇటీవల ప్రచారం జరిగింది.
అయితే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు నేడు అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఒక్కరోజు ముందే నేడు అందుబాటులోకి వచ్చేసింది. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా, ఓటు విలువను తెలిజెప్పేలా ఉన్న ఈ చిత్రం నేడు ఓటీటీలో విడులైంది. ఇందులో ఓటు ఎంత శక్తిమంతమైనదో చెబుతుంది. తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాను తమిళంలో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించగా.. తెలుగులో ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించింది. ఇక దర్శకురాలిగా ఆమెకు తొలి సినిమా ఇది.

అక్టోబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో సంపూ యాక్టింగ్ హైలెట్‌గా నిలిచింది. ఓటు కోసం ఇద్దరు రాజకీయ నాయకులు.. మార్టిన్ లూథర్ కింగ్ (సంపూర్ణేశ్ బాబు)ను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేయగా, అప్పటి వరకు అనామకుడిగా ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. అతడు ఏం చేశాడన్నదే ఈ మూవీ ప్రధానమైన కథగా ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని తప్పక అలరిస్తుందని చెబుతున్నారు.