Supreme Court : ఆస్తులకు సంబంధించి, చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ఆస్తి ఎవరు తీసుకోవాలి, ఎవరికి హక్కు ఉంటుంది అని ప్రశ్నలకు సమాధానాలు, చాలామందికి తెలియదు. వాటి కోసం వెతుకుతూ ఉంటారు. తండ్రి ఆస్తిలో, కూతురు వాటా ఎంత అనే దాని మీద సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. భారతదేశము యొక్క సుప్రీంకోర్టు వారికి తండ్రి ఆస్తిలో కొడుకులు, కూతుర్లు సమాన హక్కుల్ని సమర్ధించింది. హిందూ వారసత్వ చట్టంలోని, నిబంధనని అనుసరించే ఈ నిర్ణయం కీలకమైనది. ఆస్తివారసత్వం పై, కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలంగా ఉన్న వివాదాలు, విభేదాలకి ముగింపు పలికింది.
2005లో కూతుర్లకి వారి తండ్రి ఆస్తి లో, సమాన వాటా కల్పించే చట్టం ప్రవేశపెట్టింది. తాజాగా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్ ఆదేశాలతో, దీనిపై ఇంకాస్త స్పష్టత వచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారం, కొడుకులు, కూతుళ్లు ఇద్దరు తండ్రి ఆస్తుల సమాన హక్కుని అనుభవిస్తారు. ఈ సమానత్వం ఆస్తి హక్కుల యొక్క ప్రధాన భాగానికి విస్తరించింది. కుమార్తెలు కూడా, వారసత్వ హక్కుల్ని కలిగి ఉంటారని నిర్ధారిస్తుంది.

తండ్రి ఆస్తిని కొడుకులు, కూతుళ్లు సమానంగా న్యాయంగా పంచుకోవాలని, కోరుతూ చెప్పింది. హైకోర్టు తీర్పు ప్రకారం కొడుకులు, కూతుళ్లు ఇద్దరు కూడా సమాన హక్కు అనుభవించాల్సి ఉంటుంది. తండ్రి ఆస్తిని కూతుళ్లు, కొడుకులు ఇద్దరూ కూడా సమానంగా న్యాయంగా పంచుకోవాలని కోర్టు నిర్దారించింది.
కొడుకులకి సంబంధించి ఆస్తి హక్కుల లో అసమానతలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు, తన భర్త ఆస్తిలో హక్కులతో తన భర్త ఇంటిలోకి మారింది. కాబట్టి, ఆస్తి హక్కు లేదు అనే వారు. కానీ, ఇప్పుడు ఈ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, ఇద్దరికీ సమాన హక్కు ఉందని తెలుస్తోంది.