Dasara 2023 Date And Time : హిందువులు దసరా పండుగని, ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. దసరా నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి, పూజ చేసుకోవడం, పిండివంటలని వండుకుని తినడం, ఇలా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు, దసరా పండుగ ని జరుపుతారు. దసరా పండుగ అంటే నవరాత్రులు కూడా సంబరాలే. తొమ్మిది రోజులు కూడా, అమ్మవారిని పూజించి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలని కూడా పెడుతూ ఉంటారు. దసరా విషయంలో ఈ సంవత్సరం చాలా మందిలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది.
ఈసారి వచ్చే పండుగలు అన్నీ కూడా, ఏ రోజు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. రెండు రోజుల్లో తిధులు రావడం వలన, అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దసరా కూడా ఎప్పుడు అని అంత ఆలోచనలో పడ్డారు. దసరా 23న లేదంటే 24న అనే సందేహం ఉన్నట్లయితే… ఇప్పుడే క్లియర్ చేసుకోండి. విజయ దశమి విషయాన్ని పరిగణ లోకి తీసుకుని, 23వ తారీఖున నవమి తిధి, మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది. 24 వ తారీఖున నవమి తిధి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఉంది.

కనుక, మధ్యాహ్నం దశమి తిధి ఉండే రోజున, విజయదశమిగా జరుపుకోవాలని శాస్త్రం చెప్తోంది. కాకపోతే 23, 24 తారీకుల్లో దశమి తిధి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రవణ యోగం ఉన్న రోజున పరిగణలోకి తీసుకోవాలి. ఇలా చూసినట్లయితే, దసరా పండుగ ఈసారి 23 వ తారీఖున వచ్చింది.
శ్రావణ యోగం 23న ఉంది. కాబట్టి, 23న దసరా పండుగని చేసుకోవాలి. అంటే, విజయదశమి పండుగని 23 వ తేదీని చేసుకోవాలి. 24 వ తేదీ మధ్యాహ్నం వరకు దశమి తిధి ఉన్నా కూడా పూర్వదినాన్ని గ్రహించాలని పండితులు చెప్పారు. ఈ లెక్కన 23వ తేదీన మహర్నవమి, అదే రోజున, విజయదశమి అని పండితులు అంటున్నారు.