Roja : రోజా గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రోజా అందరికీ సుపరిచితమే. చాలా మంది టాప్ హీరోల పక్కన రోజా నటించింది. స్టార్ హీరోయిన్ గా, రోజా మంచి పేరుని తెచ్చుకుని, తర్వాత జబర్దస్త్ జడ్జిగా కూడా వ్యవహరించింది. పాలిటిక్స్ లో కూడా రోజా యాక్టివ్ గా ఉంటుంటారు. ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ గా రోజా కొనసాగుతున్నారు. మినిస్టర్ రోజా కి సంబంధించిన ఒక విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోజా ఆహారపు అలవాట్లు చూసి, అందరూ షాక్ అవుతున్నారు. బుల్లితెర సెలబ్రిటీలు శ్రీవాణి, విక్రమ్ ఆదిత్య ‘మీ కడుపు నిండా; అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేశారు. ఓపెనింగ్ కి వెళ్ళిన రోజా మీడియాతో, పలు విషయాలని పంచుకున్నారు. ఆమెకి ఇష్టమైన వంటకాల గురించి అలానే, ఆమె డైట్ ప్లాన్ గురించి రోజా చెప్పారు. రోజా తన కి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమని చెప్పారు.

ఆమె కి ఇష్టమైన వంటకాల గురించి చెబుతూ.. రొయ్యల ఇగురు, కీమల ఉండలు, పీతల ఫ్రై, చేపల పులుసు అంటే, ఆమెకి చాలా ఇష్టమని రోజా చెప్పారు. అలానే, ఆమె డైట్ ప్లాన్ గురించి చెబుతూ.. ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ ని, ఉదయం తింటానని, మధ్యాహ్నం భోజనం లో నాన్ వెజ్ తప్పనిసరిగా తీసుకుంటానని, కార్తీకమాసం లేదా ఆలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం, నాన్ వెజ్ తీసుకోనని చెప్పారు రోజా.
ఇక డిన్నర్ టైం లో, ఆమె ఇడ్లీ కానీ దోసె లేదంటే ఏదైనా అల్పాహారాన్ని తీసుకుంటానని చెప్పారు. శ్రీవాణి, విక్రమాదిత్య ఓపెన్ చేసిన ఈ కొత్త రెస్టారెంట్ వేడుకల్లో బుల్లితెర నటులు చాలామంది వచ్చి, సందడి చేశారు. సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళిద్దరూ అలరిస్తూ పేరు తెచ్చుకున్నారు. తాజాగా, మొదలుపెట్టిన ఈ ఫుడ్ బిజినెస్ లో కూడా విజయం సాధించాలని అంతా చెప్పారు.