Fruits For Dengue : అనేక రకాల అనారోగ్య సమస్యలు, వస్తూ ఉంటాయి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అంటే, దాని నుండి కోలుకోవడం కొంచెం కష్టమే. చాలామంది, డెంగ్యూ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా డెంగ్యూ వలన ఇబ్బంది పడుతున్నారా..? త్వరగా కోలుకోవడానికి, ఇవి మీకు బాగా సహాయం చేస్తాయి. డెంగ్యూతో బాధపడే వాళ్ళు, త్వరగా కోలుకోవడానికి పోషకాహారాన్ని తెలుసుకోవడం, చాలా అవసరం. ఈరోజు మేము మీకోసం కొన్ని సూపర్ ఫుడ్స్ ని తీసుకు వచ్చాము. ఈ ఆహార పదార్థాలను కనుక, మీరు తీసుకున్నట్లయితే, డెంగ్యూ నుండి ఈజీగా బయటపడవచ్చు.
డెంగ్యూ అనేది డిఈఎన్వి వైరస్ వలన కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. దోమ కాటు ద్వారా మనుషులకు, ఇది వ్యాపిస్తుంది. భారతదేశంలోనే కాకుండా, అనేక దేశాలలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగ్యూ నుండి కోలుకోవడానికి, పోషక ఆహార పదార్థాలను తీసుకోండి. వీటిని తీసుకోవడం వలన, తిరిగి బలాన్ని పొందవచ్చు. తిరిగి ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలని సరిపడా ఉంచుకోవడానికి, ఐరన్ వంటి పోషకాలు కావాలి.

పండ్లు, కూరగాయలు, విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ ఇవన్నీ కూడా అందేటట్టు చూసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే, ఈజీగా రికవరీ అవ్వచ్చు. కివి మీకు బాగా పనిచేస్తుంది. కివీను తీసుకోవడం వలన, రోగిని నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా, ఉపయోగపడుతుంది. బొప్పాయిని కూడా తీసుకోండి. వేగంగా కోల్కుంటారు.
బొప్పాయి లో కూడా, చక్కటి గుణాలు ఉన్నాయి. అలానే, దానిమ్మ పండ్లు తీసుకుంటే కూడా డెంగ్యూ నుండి సులభంగా బయటపడవచ్చు. పాలకూరని తీసుకుంటే కూడా, డెంగ్యూ నుండి బయటపడడానికి అవుతుంది. పాలకూరలో ఐరన్, ఫోలేట్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బీట్రూట్ ని తీసుకుంటే కూడా ఈజీగా మీరు డెంగ్యూ నుండి బయటపడొచ్చు. గుమ్మడికాయ కూడా, మీకు సహాయం చేస్తుంది. గుమ్మడికాయలో విటమిన్ ఏ, బీటా కేరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మంట, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా చేర్చుకోండి. ఇలా, డెంగ్యూ నుండి బయట పడవచ్చు.