బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. తమ అభిమాన సెలబ్రిటీలు అందరూ ఒకే చోట చేరి సందడి చేస్తుంటే అభిమానులు తెగ సంబరపడిపోతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే ఎప్పుడో ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల కంటెస్టెంట్ ల ఎంపిక విషయంలో, బిగ్ బాస్ హౌస్ సెట్టింగ్ పనులలో జాప్యం కారణంగా ఈ షో వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ రియాలిటీ షో జూన్ నెలలో ప్రారంభమవుతుందని గతంలో వార్తలు వచ్చినప్పటికీ కరోనా కారణం వల్ల వాయిదా పడక తప్పలేదు. తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో మరి కొంత ఆలస్యంగా ప్రసారం కానుందని తెలుస్తోంది.
ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఈ కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నప్పటికీ ఈ షో ఆగస్టు నెలలో ప్రసారం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అప్పటికి కూడా పనులు పూర్తి కాకపోతే ఈ కార్యక్రమాన్ని గత ఏడాది మాదిరిగానే సెప్టెంబర్ నెలలో ప్రసారం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారని ప్రకటించగా.. తాజాగా రానా పేరు వినిపించినప్పటికీ ఈ షో కి మాత్రం హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.