God Rings : మనలో చాలామంది దేవుడి ప్రతిమలున్న ఉంగరాలు, మెడలో చెయిన్లకు లాకెట్లు ధరిస్తుంటారు. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించగానే సరికాదు.. అవి ధరించడానికి, ధరించాక కూడా కొన్ని పద్దతులున్నాయి. అవి పాటించకపోతే వాటిని ధరించడం వలన కలిగేది నష్టమే.. ఆ నియమాలు ఏంటో చూడండి..
ఉంగరాన్ని ధరించే ముందు ఆలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు జరిపించాలి, అప్పుడే వాటికి శక్తి లభించి ఆ భగవంతుడు మనతో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఉంగరంలోని దేవుడి ప్రతిమ కాళ్లు చేతిగోళ్లవైపు, తల మణికట్టువైపు ఉండేలా పెట్టుకోవాలి. అద్దుకునేప్పుడు చేయి గుప్పిట ముడిచి అద్దుకోవాలి. అప్పుడు భగవంతుడి కాళ్లకి నమస్కరించినవారిమవుతాం. దేవుని ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి మాంసాహారం తినరాదు. అంతేకాదు ఎంగిలి అంటకుండా తినాలి. ఆడవారు పీరియడ్స్ సమయంలో ఉంగరాలను, లాకెట్స్ ను తీసివేయడం మంచిది.
మద్యం తీసుకునే వారు, సిగరెట్ తాగేవారు ఉంగరం ధరించకపోవడం ఉత్తమం. ఈ నియమాలు పాటించకుండా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు పెట్టుకుంటే మనకు మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది. కనుక ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాల్సిందే.