తెలుగు వారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయం. 295 చిత్రాల్లో ఆయన పోషించని పాత్రంటూ లేదు. ప్రతి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన నట దిగ్గజం ఎన్టీఆర్. అయితే నందమూరి అందగాడు ఎన్టీఆర్ సరసన 47 మంది హీరోయిన్లు నటించారు. వీళ్లలో ఎక్కువ చిత్రాల్లో ఆయన పక్కన నటించిన హీరోయిన్ జమున. 31 చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.
ఆ తర్వాతి స్థానం మహానటి సావిత్రిది 26 చిత్రాల్లో నటించారు. అలాగే అంజలీదేవి కూడా 26 చిత్రాల్లో నటించడం గమనార్హం. వీళ్లందరిలో ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ కృష్ణకుమారి. వీరి కాంబినేషన్ కి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ కూడా ఆమెతో నటించడానికి చాలా ఆసక్తి చూపేవారు. ఈ కారణంగా ఆయనతో పాతిక సినిమాలు చేయగలిగారు. ఎన్టీఆర్ తో మొదటి చిత్రం పిచ్చిపుల్లయ్య. 25వ చిత్రం వరకట్నం. ఎన్టీఆర్ తో ఆమె తొలి పరిచయం నవ్వితే నవరత్నాలు సినిమా ప్రివ్యూ రోజున జరిగింది.
ఆ సినిమాలో ఆమె నటన బాగుందని ఎన్టీఆర్ స్వయంగా అభినందించారు. 1953లో పిచ్చి పుల్లయ్య సినిమాలో కృష్ణకుమారికి అవకాశం కల్పించారు ఎన్టీఆర్. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు వృత్తి నిబద్ధత ఏమిటో ఆమెకు తెలిసింది. ఆ తర్వాత 4 సంవత్సరాలకు కానీ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రాలేదు. ఈ విధంగా ఎన్టీఆర్ కృష్ణకుమారి జంటకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. దీంతో వారి మధ్య చాలా సినిమాలు వచ్చాయి. ఆ రకంగా ఎన్టీఆర్ కృష్ణకుమారి మధ్య ఏదో ఏర్పడిందని, అది పెళ్లిదాకా దారి తీసిందని, కృష్ణకుమారి ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారని అంటుంటారు.