భారతదేశంలో జరుపుకునే ఎన్నో పండుగలలో హోలీ పండుగ ఒకటి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కాగా నేడు రంగుల పంచమి కావడంతో హోలీ పండుగను ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలలో హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ రంగ్ పంచమి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పంచమి తిథి రోజు వస్తుంది.
మన హిందూ పురాణాల ప్రకారం ఈ పంచమి తిథి రోజుతో హోలీ పండుగ ముగుస్తుంది. పేరులో ఉన్న విధంగానే ఈ పంచమిని 5 రకాలుగా నిర్వహిస్తారు.నీరు, గాలి, భూమి, ఆకాశం మరియు అగ్ని. ఈ పంచ భూతాలపై ఆధారపడి ప్రతి ఒక్కరి ఉనికి గుర్తుగా ఈ రంగుల పంచమి వేడుకలను నిర్వహిస్తారు.ఈరోజు అగ్ని వెలిగిస్తే మన జీవితంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం.
ఈ విధంగా రంగ్ పంచమి రోజున అగ్ని దహనంతో వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి సానుకూల వాతావరణంతో నిండిపోతుంది. కనుక ఈ వేడుకలకు గుర్తుగా రంగ్ పంచమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ రోజున ప్రజలందరూ ఎంతో సంతోషకరంగా రంగులను చల్లుకుంటూ పాటలు పాడుతూ, ఒకరికొకరు శుభాకాంక్షలను తెలియజేస్తుంటారు. ఈ రంగ్ పంచమి రోజుతోనే హోలీ వేడుకలు ముగుస్తాయి.