ANR : ఇప్పటి రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సినిమాకి దాదాపు 500 కోట్లు ఖర్చు అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మొన్నటికి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక రాబోతున్న ప్రభాస్ ఆది పురుష్ చిత్రానికి కూడా దాదాపు రూ.500 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా భారీ బడ్జెట్ లతో నిర్మిస్తున్న సినిమాలలో స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ గా దాదాపు రూ.100 కోట్లు వరకు అందుకుంటారు.
కానీ అప్పటి తరం మన హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ప్రతి ఒక్కరూ స్వయంకృషితో పైకి వచ్చినవారే. నటనపై మక్కువతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. సినీ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచారు. 1980 కి ముందు చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ లో నిలబెట్టడం కోసం అప్పటి తరం స్టార్ హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి వారు ఎంతో గొప్ప కృషి చేశారు.

అప్పట్లో అగ్రస్థాయి హీరోలకి ఇప్పటి తరం హీరోలు మాదిరిగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఉండేది కాదు. కేవలం ఎన్టీఆర్ చిత్రాలకు మాత్రమే రూ.40 లక్షల వరకు అధిక బడ్జెట్ ఉండేది. అంటే అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలు మాత్రమే అత్యధిక బడ్జెట్ చిత్రాలు. దక్షిణ భారతదేశం మొత్తంలో భారీ పారితోషికం అందుకొనే వారి లిస్ట్ లో ఎన్టీఆర్ ముందు ఉండేవారు. ఒక సినిమాకి రూ.40 లక్షల బడ్జెట్ ఉంటే ఎన్టీఆర్ కేవలం రూ.12 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారట.
ఆ తర్వాత ఏఎన్నార్ సినిమాలకు రూ. నుండి రూ.30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. ఏఎన్నార్ కూడా అప్పట్లో ఒక సినిమాకి రూ.10 లక్షలు తీసుకునేవారట. తర్వాత లిస్టులో మూడవ వారు కృష్ణ. కృష్ణ సినిమా బడ్జెట్ 20 నుంచి 25 లక్షల వరకు ఉంటే అందులో ఒక్క సినిమాకి రూ.7 లక్షల రెమ్యూనరేషన్ అందుకునేవారట. ఇక శోభన్ బాబు కూడా ఒక సినిమా బడ్జెట్ రూ.20 లక్షలు అయితే అందులో రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారట.