Prabhas : ఆరడుగుల కటౌట్ తో హీరో అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటుంది ప్రభాస్ లుక్. ఈశ్వర్ చిత్రంతో వెండితెరపైకి అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ బిహేవియర్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరో అయినప్పటికీ కూడా సెట్స్ లో అందరితో మంచిగా కలిసిపోతాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలవాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కూడా ప్రభాస్ ముఖంలో ఎప్పుడు కూడా కొంచమైనా గర్వం కనిపించలేదు. ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరిస్తాడు. అందుకే ప్రభాస్ ని ముద్దుగా ఇండస్ట్రీలో అందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారు.
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఈ ఒక సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ వంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ప్రభాస్ పక్కన ఒక్క సినిమాలోనైనా నటించే ఛాన్స్ వస్తే చాలనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోని ఒకప్పటి రోజుల్లో ఓ దర్శకుడు ప్రభాస్ కి స్టార్ డమ్ లేదని ఓ చిత్రం నుంచి తొలగించడం జరిగింది. ఆ సినిమా నుండి తొలగించినా కూడా ఆ సినిమా ఆడియో లాంఛ్ కు గెస్ట్ గా వెళ్లి చిత్రయూనిట్ ను అభినందించాడు ప్రభాస్. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే.. విక్టరీ వెంకటేష్, ఆసీన్ జంటగా నటించిన ఘర్షణ చిత్రం. 2004లో విడుదలై ఈ సినిమా అప్పటిలో మంచి విజయం సాధించింది. . పోలీస్ పాత్రలో వెంకటేష్ చాలా అద్భుతంగా నటించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అయితే ఘర్షణ సినిమాకు మొదటగా ప్రభాస్ ను హీరోగా ఎంపిక చేశారు. సినిమా ప్రారంభించడం కోసం పూజకార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ అప్పటికే ఈశ్వర్, రాఘవేంద్ర చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న ప్రభాస్ కు ప్రేక్షకులలో క్రేజ్ తక్కువగా ఉందన్న కారణంతో దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రభాస్ ని పక్కన పెట్టి వెంకటేష్ ను హీరోగా ఎంపిక చేశారట. ఇక ఈ సినిమా మిస్ చేసుకున్న ప్రభాస్ అదే ఏడాది వర్షం చిత్రంతో సక్సెస్ ను అందుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.