Bandla Ganesh : టాలీవుడ్ ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో బండ్ల యమ స్పీడ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అంశాలపై స్పందిస్తూ.. ట్వీట్లు, పోస్టులు పెడుతుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఆయనపై పెట్టిన పోస్టులతో బండ్ల ఎప్పుడూ హైలెట్ అవుతుంటాడు. బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కు ముందు బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తిట్టిన ఆడియో బయటకి వచ్చింది. అయితే అప్పట్లో బండ్ల గణేష్ ఆ గొంతు తనది కాదు అన్నాడు.
మరి ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆ గొంతు తనదే అని ఒప్పుకున్నాడు. మరి ఎందుకు తిట్టావ్ అని అడిగితే, మనిషన్నాకా కోపం రాదా అని తిరిగి ప్రశ్నించాడు బండ్ల. ఆ తర్వాత అతనికి సారీ కూడా చెప్పానని ఇంటర్వ్యూలో తెలిపాడు. త్రివిక్రమ్ పై బండ్ల బూతుల ఆడియో విడుదలయ్యాక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ఉన్నా స్టేజ్ పై స్పీచ్ ఇవ్వలేదు. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే ఇంకా డైలాగులు త్రివిక్రమ్ అందించాడు. అయినా కానీ బండ్ల ఆడియో దెబ్బకి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ నోటి నుంచి మాటలు రాలేదు.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ఫొటోలకే పరిమితం అయ్యాడు. బండ్ల ఆ మధ్య ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. కొంతమంది నిర్మాతలు తన ఇంటర్వ్యూ రాకుండా మీడియా వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారని నిర్మాతలను విమర్శించాడు. మళ్ళీ ఇదిగో ఇప్పుడు త్రివిక్రమ్ ని తిట్టిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు. అసలు బండ్ల ఎందుకు ఇంత లూజ్ గా మాట్లాడుతున్నాడు అని పరిశ్రమలో కొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా బండ్ల గణేష్ తన మాటలను కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచిదంటున్నారు సినీ ప్రముఖులు.