Weight Loss : ప్రస్తుతం చాలా మంది హడావిడి జీవితంలో పడి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీనితో దాదాపు చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మన జీవన క్రియలో మార్పుల వల్ల అనేక శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. బరువు పెరగడానికి అతి పెద్ద కారణం బయట ఆహారాలకు ఎక్కువగా అలవాటు పడటం. బయట దొరికే ఆహారంలో చాలా రకాల కొవ్వు పదార్థాల ఉంటాయి. అంతే కాకుండా వాటిలో హానికరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో హానికరం. వీటిని తినడంతో బరువు పెరగడమే కాకుండా అనేక వ్యాధులకు గురవుతారు. శరీరంలో పెరిగిన అధిక కొవ్వును తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.
శరీర ఆకృతి చక్కగా మారాలి అంటే మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనె మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం సేంద్రీయ కొబ్బరి నూనె 2 నుంచి 3 స్పూన్స్ తీసుకోవాలి. కొబ్బరి నూనె సీసాను తీసుకోని వేడి నీటిలో పెడితే నూనె కరగటం మొదలవుతుంది. ఇలా కరిగిన ఈ కొబ్బరినూనెను ఉదయం, మధ్యాహ్నం సాయంత్రం, రోజూ భోజనం ముందు 2 లేదా 3 స్పూన్లు తీసుకోవాలి. అంతేకాకుండా కొబ్బరి నూనె, నిమ్మరసం మరియు వేడి నీరు కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఇంకా మేలు చేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ C సమృద్దిగా ఉండుట వలన జీవక్రియలను మెరుగుపరచడమే కాకుండా మూత్రపిండాలు మరియు కాలేయం నుండి పదార్థాలను బయటకు పంపుతుంది.
ఈ విధంగా విష పదార్థాలు బయటకు వెళ్ళటంతో సహజంగానే బరువు తగ్గటానికి సహకరిస్తుంది. అంతేకాక నిమ్మలో ఉండే యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు మనల్ని ఫిట్ గా ఉంచేందుకు సహాయపడతాయి. అదే సమయంలో వేడి నీరు కూడా మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి శరీరంలో ఉండే వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. నిమ్మరసం, కొబ్బరి నూనె రెండూ కలిసినప్పుడు అధిక బరువును నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
మన శరీర బరువును నియంత్రించే డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కరిగించిన సేంద్రీయ కొబ్బరి నూనె ఒక టేబుల్ స్పూన్, నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్స్, ఒక గ్లాసు వేడి నీటిని తీసుకోవాలి. వేడి నీటిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె, 2 స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పానీయాన్ని భోజనానికి అరగంట ముందు తాగాలి. ఇది బరువు తగ్గడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
అంతేకాకుండా కొబ్బరి నూనె మరియు తేనెతో కలిపిన పానీయం కూడా శరీర బరువును తగ్గించడానికి ఎంతగానో సహకరిస్తుంది. బరువు కోల్పోవటానికి సమర్ధవంతంగా పనిచేసే పదార్దాలలో తేనె ఒకటి. తేనో వినియోగం వలన జీవక్రియల వేగం పెరిగి సమర్థవంతంగా కొవ్వు కరగటానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ వేడి నీటిలో తేనె మరియు కొబ్బరి నూనె రెండూ కలపాలి. అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలిపి, ఈ పానీయాన్ని ఉదయం ఒక్క సారి, సాయింత్రం ఒక్క సారి తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గడంలో సహకరిస్తుంది.