Krithi Shetty : ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీతో కృతి శెట్టికి మంచి ఫేమ్ వచ్చింది. యంగ్ కాలేజ్ గర్ల్ గా కృతి కుర్ర మనసుల్ని దోచేసింది. ఉప్పెన విజయంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. అయితే ఇప్పుడు కృతికి తిరోగమనం మొదలైనట్లు అనిపిస్తుంది.
కృతిశెట్టి నటించిన ది వారియర్ మూవీ ఫ్లాప్ అయ్యింది. అలాగే మొన్న విడుదలైన మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నితిన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి విమర్శకులు దారుణమైన రేటింగ్ ఇచ్చారు. అలాగే ఇటీవల విడుదలైన సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఫ్లాప్ టాక్ నడుస్తుంది. దీంతో కృతిశెట్టి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ లు చేరినట్టైంది. మొదటి మూడు చిత్రాల విడుదల తర్వాత కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఏలేస్తుంది ఈ అమ్మడు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.

సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృతి కెరియర్ ఇబ్బందుల్లో పడింది. కాకపోతే రీసెంట్‌గా ప్రెస్ మీట్ లో కృతి మాట్లాడుతూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ.. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇద్దామనుకుంటున్నాను అంటూ ఆమె చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మూడు ఫ్లాప్ లు పడగానే ఇంత దిగులా.. కృతి నీ మైనస్‌లలకు కారణం స్టోరీ ఎంపిక.. మంచి స్టోరీస్ ఎంచుకో అంటూ బూస్టప్ ఇస్తున్నారు అభిమానులు. మరి అభిమానుల మాట వింటుందో లేదో.. చూడాలి.