Payal Rajput : టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ అందాలు ఆరబోయడంతో హద్దులు చెరిపివేయడంలో ఆమె తరువాతే ఇంకెవరైనా అని చెప్పవచ్చు. అటువంటిది బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్‌కు పట్టరాని కోపం వచ్చిందట. తన కోపాన్ని చూపిస్తూ.. చిందులేస్తూ.. చిర్రుబుర్రులాడింది. ఏకంగా ఎయిర్ పోర్ట్ సిబ్బందిపై మండిపడింది పాయల్. ఇంతకీ ఈ అందాల భామకి అసలు అంత కోపం ఎందుకు వచ్చిందంటే..?
ఇటీవల ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో పాయల్ రాజ్‌పూత్ ప్రయాణం చేసింది. ఈ జర్నీలో తన లగేజీని చూసుకోగా అది దారుణంగా డామేజ్ అయ్యింది. దాంతో ఇండిగో విమాన సిబ్బంది తన లగేజీని ఇష్టానుసారంగా విరిసిరేశారని కోపంతో రగిలిపోయింది పాయల్. లగేజ్ ను ఇలా ఇంత నిర్లక్ష్యంగా విసిరి పారేస్తారా…? దీంతో తన లగేజీ డ్యామేజీ అయ్యిందని చెప్పుకొచ్చింది పాయల్. అంతే కాదు ఈ ప్రయాణం తనకు ఇంతకు ముందు ఎప్పుడూ ఎదురవని చేదు అనుభవాన్ని మిగిల్చిందని పాయల్ రాజ్ పూత్ తెలిపింది.

ఇక పాయల్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా డ్యామేజ్ అయిన ఆమె లగేజ్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ప్రైవేటు విమానయాన సంస్థ సిబ్బంది అత్యుత్సాహమే ఇందుకు కారణం అని తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై నెటిజన్లు పాయల్ కు మద్దతు ఇచ్చారు. ఒక హీరోయిన్ లగేజ్ పరిస్థితే ఇలా ఉంటే.. కామన్ పాసింజర్స్ లగేజ్ ను వీళ్లు ఎలా చూస్తారో అంటూ నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడీగా బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పూత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి ప్రేక్షకులను మెప్పించడంతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడీగా పాయల్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలకు, వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ చిత్రంతో పాయల్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.
RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని సరిగ్గా వినియోగించుకోవడంలో పాయల్ రాజ్ పూత్ కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోలేకపోవడం వలన కమర్షియల్ గా సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోలేకపోతోంది. డిస్కో రాజా, వెంకీ మామ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు మాత్రం లభించటంలేదు. సినిమాల ద్వారా మంచి కమర్షియల్ హిట్ పడకపోయినా, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ చూసేవాళ్ళ మతులు పోగొడుతుంది.