Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డె ఫిట్‌నెస్ కి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. మంచి ఫిజిక్ తో సినిమాల్లో బికినీ పోజులకు కూడా సై అంటూ ఉంటుంది. కొన్ని సినిమాల్లో హాట్ బికినీ పోజులతో ఎక్స్‌పోజింగ్ కూడా చేసి అలరించింది. తను హీరోయిన్ గా చేసిన ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి వరుస సినిమాలు పరాజయం పాలైనప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు రావడం మాత్రం తగ్గడం లేదు. పూజ హెగ్డెకి తన అందచందాలతోనే సినిమా ఛాన్సులు వరుస కడుతున్నాయని ప్రస్తుతం టాక్ నడుస్తుంది.
అయితే పూజా తన బాడీని అలా సన్నగా నాజూగ్గా మెయింటెయిన్ చేయడానికి తరచూ జిమ్ ఇంకా పిలాటిస్ క్లాసులకు వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డె లేటెస్ట్ గా జిమ్ నుండి బయటకు వస్తూ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలో తను ఒంటికి అతుక్కుపోయే విధంగా బిగుతుగా ఉన్న టాప్ ఇంకా ప్యాంట్ వేసుకొని దర్శనం ఇచ్చింది. అలాగే ఆ ఫోటోలో తన ఒంపు సొంపులు కూడా పర్ఫెక్ట్ గా కనిపించేలా ఉండడంతో కుర్రకారు వెర్రెక్కి పోతున్నారు. ఎవరైనా సరే తన అందానికి ముగ్ధులు అవ్వాల్సిందే అంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డె ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ లో త్వరలో పాల్గొననుంది. అలాగే బాలీవుడ్ లోనూ రణ్ వీర్ సింగ్ ఇంకా సల్మాన్ ఖాన్ చిత్రాలలో చేయనుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూజా హెగ్డెను పరిశ్రమలో ఇప్పటికే ఐరన్ లెగ్ అని పిలుస్తున్నారు. ఇకనైనా విజయాలను చూస్తుందో లేదో అని ఎదురు చూస్తున్నారు.