Trisha : తెలుగువారికి చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయనక్కర్లేదు. తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన త్రిష కృష్ణన్ అందాల పోటీల్లో మిస్ చెన్నై విజేతగా నిలిచింది. ఈ క్రేజ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1999లో హీరో ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన జోడీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది త్రిష. ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన మౌనం పేసియదే అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత వరుస ఆఫర్లతో దక్కించుకొని తమిళ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది.
నీ మనసు నాకు తెలుసు చిత్రంతో టాలీవుడ్ లో తరుణ్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ సరసన నటించిన వర్షం చిత్రం సక్సెస్ తో త్రిష ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. వర్షం చిత్రం సక్సెస్ తో తెలుగులో అనేక ఆఫర్లు దక్కించుకుని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన త్రిష టాలీవుడ్ యువ హీరోలందరితో జతకట్టి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్యూటీకి అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

ఇంత క్రేజ్ వున్న ఈ అమ్మడు తాజాగా పలువురు హీరోలతో ప్రేమాయణం నడిపిన్నట్లు వార్తలలోకి ఎక్కింది. త్రిషపై ప్రస్తుతం ఈ విషయమే హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రముఖ వ్యాపార వేత్త వరుణ్ మనియన్‌తో త్రిష లవ్ ట్రాక్ నడిపించడమే కాకుండా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తరవాత ఏం జరిగిందో ఏమో గానీ పలు కారణాల వలన వీరిద్దరూ విడిపోయారు. వరుణ్ తో విడిపోయిన రెండు నెలలకే త్రిష హీరో రానాతో లవ్ ట్రాక్ నడిపింది అంటూ టాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి.
అయితే కొంతకాలానికి ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. తర్వాత రానా మిహికను వివాహం చేసుకున్నారు. అంతే కాకుండా త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో మొదటి సారిగా తమిళ స్టార్ హీరో విజయ్ తో లవ్ ట్రాక్ నడిపింది అంటూ కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి. ధనుష్, శింబుతో కూడా త్రిష లవ్ ఎఫైర్ నడిపించింది అనే టాక్ ఉంది. ఇలా చాలా లవ్ ట్రాక్స్ నడిపిన ఈ భామ ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది.
ప్రస్తుతం మణి రత్నం దర్శక నిర్మాణంలో హీరో విక్రమ్ నటిస్తున్న భారీ చిత్రం పొన్నియిన్ సెల్వన్ లో త్రిష ఓ కీలక పాత్రలో కనబడబోతుంది. ఈ సినిమా ఈ సెప్టెంబర్ 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో పాటు త్రిష నటించిన గర్జన, రోడ్, రంగి, చదురంగ వేట్టై 2 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది త్రిష కృష్ణన్.