Pranitha : టాలీవుడ్ కు చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు ప్రణీత పరిచయం కాగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది, మహేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం, జూనియర్ ఎన్టీఆర్ తో రభస, మంచు విష్ణుతో పాండవులు పాండవులు తుమ్మెద, రామ్‌తో హలో గురు ప్రేమకోసమే చిత్రాలతో అలరించింది.
గతేడాది హంగామా 2, భూజ్ సినిమాలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఏ భాషలోనూ ప్రణీత స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రణీతకు మూవీ అవకాశాలు లేవని చెప్పొచ్చు. దానికి తోడు పెళ్ళైన హీరోయిన్ అంటే మేకర్స్ కాస్త ఆలోచిస్తారు. అదే ప్రణీతకు జరిగింది.

ప్రణీత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. మనవాళ్లకి వరుస సినిమాలు చేస్తున్న వాళ్లపై ఉన్న క్రేజ్ మిగతా వారిపై ఉండదు. తల్లైన తర్వాత బాడీ షేప్స్ మారిపోవడం యూత్ లో క్రేజ్ తగ్గిపోడంతో మేకర్స్ పెళ్ళైన హీరోయిన్స్ విషయంలో అంతగా ఆసక్తి చూపించరు. అయినప్పటికీ ప్రణీత తన గ్లామర్ ఫొటో షూట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ఎన్ని గ్లామర్ పిక్స్ షేర్ చేసినా ప్రణీతను పట్టించుకునే వారు లేనప్పుడు ఎన్ని షేర్ చేసి ఏం లాభం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీపై ఎవరైనా ఓ లుక్ వేస్తారేమో.. తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందో, లేదో చూడాలి.