Varalaxmi Sarathkumar : సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ. వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ నటిగా సొంత గుర్తింపు దక్కించుకుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా ద్వారా తెలుగులో ఇండస్ట్రీలోకి తన ఎంట్రీ ఇచ్చినప్పటికీ , రవితేజ సినిమాలో తాను పోషించిన జయమ్మ పాత్ర తోనే బాగా పాపులర్ అయ్యింది. క్రాక్, నాంది సినిమాల ద్వారా పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్లకు తాను సూట్ అవుతానని నిరూపించుకుంది. అంతకు ముందు కూడా కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది.
అయితే ఇన్నాళ్లూ తను చేసిన సినిమాలన్నింటిలో బొద్దుగా కనిపించిన ఈ 37 ఏళ్ల సుందరి హఠాత్తుగా సన్నబడిపోయి అందిరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈమె లేటెస్ట్ గా తన ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోల ద్వారా ఈ విషయం తెలిసింది. కేవలం 4 నెలల కాలంలోనే ఆమె ఈ విధంగా బరువు తగ్గిందని సమాచారం. ఎవరైనా ఇలా తగ్గడం అసాధ్యం అని అంటున్నారు.

ఇక ఈమె ఇన్ స్టాగ్రామ్ పోస్టు లో తన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసింది. పోరాటం నిజం, సవాలు నిజం, నీకు ఏం కావాలో అది సాధించడానికి ఏదీ నిన్ను ఆపలేదు, నువ్వు ఎవరూ, నువ్వు ఏం అవుతావు అని ఎవరూ నీకు చెప్పలేరు, నీకు నువ్వే సవాలు వేసుకో, నీకు నువ్వే పోటీగా తయారవ్వు, అప్పుడు నువ్వు ఏ సాధించావో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు.. అని తెలియజేసింది.
ఇంకా తను ఇలా సన్నబడడానికి 4 నెలలు శ్రమించానని, తన కష్టానికి ప్రతిఫలం ఇదని, మనకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేయాలని, ఇతరుల సంతోషం కోసం చేయకూడదని, మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇతరులు చెప్పవద్దని, మన ఆత్మవిశ్వాసమే మనకు ఆయుధమని, మనల్ని మనం నమ్మాలని రాసుకొచ్చింది.
View this post on Instagram
ఏదేమైనా కొత్త లుక్ తో ఈమె అందరినీ కట్టిపడేస్తుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్.. సమంత ముఖ్య పాత్రలో రూపొందుతున్న యశోద, ఇంకా నందమూరి బాలకృష్ణ 107వ సినిమా తదితర చిత్రాల్లో నటిస్తోంది.