Shruti Haasan : కాలం మారేకొద్దీ టెక్నాలజీయే కాదు, మనుషులలోని ఆలోచనలు, వాళ్ల ఆచార వ్యవహారాలు కూడా మారుతూ వస్తున్నాయి. మన అమ్మమ్మల కాలంలో హద్దులను అనుసరిస్తూ సంస్కారానికి, సంప్రదాయానికి పెద్ద పీట వేసేవారు. ప్రస్తుత కాలంలో చాలా మటుకు స్త్రీలలో ఇలాంటి హద్దులు చెరిపేశారనే చెప్పవచ్చు. వస్త్రధారణలో మార్పు ఏర్పడింది. పొట్టి పొట్టి బట్టలు వేసుకోడానికి సిగ్గుపడటం లేదు. అంతేకాకుండా మరికొంచెం హద్దులు దాటుతూ పార్టీ కల్చర్ పేరుతో మద్యం సేవించడానికి కూడా వెనకాడటం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నటీమణులు పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఫుల్ గా తాగి పోలీసులకు దొరికిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న మన టాలీవుడ్ నటీమణులు ఎవరో ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది త్రిష. ఈమె ఫుల్ గా మద్యం సేవించి బీచ్ లో పడిపోయింది అంటూ అప్పట్లో వార్తలు కూడా బాగా ప్రసారమయ్యాయి. అంతేకాకుండా ఫుల్ గా మద్యం సేవించి పోలీసులకు దొరికిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మన కమల్ హాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ కూడా పబ్బుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా హ్యాంగ్ ఒవర్ రేంజ్ లో మద్యం సేవిస్తూ ఒక్కోసారి షూటింగ్ లకి ఆలస్యంగా వస్తుంది అంటూ వార్తలు కూడా వినిపించేవి.

సీనియర్ నటి ఊర్వశి కూడా పబ్లిక్ ఫంక్షన్స్ లో మద్యం సేవించి పోలీసులకు దొరకడం, వాళ్లతో గొడవకు దిగడం వంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దేశముదురు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక కూడా మద్యం సేవించడంలో మంచి ముదురట. కొన్ని చిత్రాలలో మద్యం తాగి నటించే సన్నివేశాలకి నిజంగా తాగి వచ్చి రచ్చరచ్చ చేసేదని అప్పుడప్పుడు టాక్స్ కూడా వినిపిస్తుంటాయి.